రోడ్డుపై వజ్రాల కోసం జనాల వేట..నెట్టింట వీడియో వైరల్

వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వాహనాలను ఆపి వెతుకులాట ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  25 Sep 2023 7:12 AM GMT
people, searching  Diamonds,  road, gujarat, Viral video,

రోడ్డుపై వజ్రాల కోసం జనాల వేట..నెట్టింట వీడియో వైరల్

ఏపీలోని కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో వజ్రాల కోసం వేట విన్నాం. చూశాం కూడా. తొలకరి చినుకుల సమయంలో పొలాల్లో వజ్రాలు దొరికినవారు చాలా మంది ఉన్నారు. బంగారంతో పోలిస్తే వజ్రాల ధర ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ వజ్రాలను రియల్‌ లైఫల్‌లో చూసినవారు తక్కువే ఉంటారు. అలాంటిది రోడ్డుపై జనాలు కొందరు వజ్రాల కోసం వెతికారు. అసలు వజ్రాలు రోడ్డుపైన దొరకడం ఏంటి. దీనిక వెనుక కథేంటో తెలుసుకుందాం..

గుజరాత్‌లో జరిగింది ఈ సంఘటన. వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వాహనాలను ఆపి వెతుకులాట ప్రారంభించారు. ఎవరికి వారు రోడ్డుపై కూర్చొని ఒక్కో రాయిని తీస్తూ.. వజ్రమేనా అని పరిశీలించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. సూరత్‌లోని వరచ్చా ప్రాంతం వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడ ఓ వ్యాపారి రోడ్డుపై వెళ్తుండగా వజ్రాల ప్యాకెట్‌ పొరపాటున జారీ రోడ్డుపై పడేసుకున్నాడని సమాచారం అందింది.

అంతే ఇక.. ఈ ప్రచారం కాస్త అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ వ్యాపించడంతో రోడ్డుపైకి చేరుకున్నారు. తమకు దొరికితే ఒకేసారి లక్షదికారులం అవ్వొచ్చనే ఆశతో రోడ్డుపై వజ్రాలు దొరుకుతాయేమో అని వేట ప్రారంభించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా విషయం తెలుసుకుని.. వారూ వెతుకులాట ప్రారంభించారు. వజ్రాల వ్యాపారి కోట్ల రూపాయల విలువైన వజ్రాల మూటను రోడ్డుపై పడేసుకున్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడమే దీనికి ప్రధాన కారణం అయ్యింది. అయితే.. ఎవరికైనా వజ్రాలు దొరికాయా..? లేదంటే అది ఫేక్‌ ప్రచారమా తెలియాల్సి ఉంది. మరోవైపు దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు వజ్రాల వ్యాపారి నిజంగానే మూట పడేసుకుంటే ముందుగా తానే వెతికేవాడు.. పోలీసులకు సమాచారం ఇచ్చేవాడు అని చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి వార్తలు తరచూ వస్తుంటాయని.. వాటిని నమ్మి మోసపోయి సమయాన్ని వృధా చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.

Next Story