తాగిన మత్తు.. ఎవరో కూడా తెలియని వ్యక్తిని హోటల్ టెర్రస్ నుండి తోసేశారు..!

బరేలీలోని ఒక వ్యాపారవేత్త ఒక వ్యక్తిని ఫైవ్ స్టార్ హోటల్ టెర్రస్ నుండి తోసి వేసి పట్టుబడ్డాడు.

By M.S.R  Published on  22 April 2024 2:00 PM IST
తాగిన మత్తు.. ఎవరో కూడా తెలియని వ్యక్తిని హోటల్ టెర్రస్ నుండి తోసేశారు..!

బరేలీలోని ఒక వ్యాపారవేత్త ఒక వ్యక్తిని ఫైవ్ స్టార్ హోటల్ టెర్రస్ నుండి తోసి వేసి పట్టుబడ్డాడు. బాధితుడిని సార్థక్ అగర్వాల్ గా.. అతడు కూడా ఓ వ్యాపారవేత్తగా గుర్తించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని గుర్తించారు. ఈ సంఘటన ఆదివారం నాడు చోటు చేసుకుంది. సీసీటీవీ కెమెరాలో ఈ షాకింగ్ సంఘటన రికార్డు అయింది. హోటల్‌లో జరిగిన పార్టీలో రిదిమ్ అరోరాతో సహా సార్థక్ అగర్వాల్ తన స్నేహితులతో హాజరయ్యాడు. రిదిమ్ తండ్రి సార్థక్ అగర్వాల్‌ను టెర్రస్ నుండి తోసివేశాడు.

వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. సంజీవ్ అరోరా ఈ గొడవలో ఇన్వాల్వ్ అవ్వడానికి ముందు రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ఫుటేజ్ చూపిస్తుంది. అగర్వాల్ సంజీవ్ అరోరా పాదాలను తాకినట్లు చూడొచ్చు, ఆ తర్వాత అరోరా కాలర్ పట్టుకుని, చెంపదెబ్బ కొట్టి, ఆపై హోటల్ టెర్రస్ నుండి తోసేశాడు. సార్థక్ అగర్వాల్ తండ్రి, సంజయ్ అగర్వాల్.. నిందితుడితో ఎలాంటి సంబంధం లేదని.. ఈ వ్యక్తులు ఎవరో నా కొడుకుకు కానీ, నాకు కానీ తెలియదని అన్నారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని తేలింది. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Next Story