ఇద్ద‌రు యువ‌కుల‌ను దారుణంగా కొట్టిన న‌ర్సులు.. వీడియో వైర‌ల్‌

Nurse Beats Men For Making Video Of Mismanagement In Bihar Hospital.ఆస్ప‌త్రిలో యువ‌కుల‌ను గ‌దిలోకి లాక్కెళ్లిన‌ న‌ర్సు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2022 3:02 AM GMT
ఇద్ద‌రు యువ‌కుల‌ను దారుణంగా కొట్టిన న‌ర్సులు.. వీడియో వైర‌ల్‌

ఓ ఆస్ప‌త్రిలో ఇద్ద‌రు యువ‌కుల‌ను గ‌దిలోకి లాక్కెళ్లిన‌ న‌ర్సులు వారిని క‌ర్ర‌ల‌తో తీవ్రంగా కొట్టారు. త‌మ‌ను కొట్టొద్ద‌ని ఆ యువ‌కులు ఎంత‌గా ప్రాధేయ‌ప‌డినా న‌ర్సులు వారిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ యువ‌కులు ఏదైనా త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించారా..? ఎందుకు కొట్టారో తెలుసుకుందాం.

బీహార్‌లోని సరన్ జిల్లాలోని ఛప్రా జిల్లా ఆస్ప‌త్రికి మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ కోసం ఇద్ద‌రు యువ‌కులు వ‌చ్చారు. అయితే.. ఆస్ప‌త్రిలో నెల‌కొని ఉన్న ప‌రిస్థితుల‌పై వారు త‌మ సెల్‌ఫోన్ల‌లో వీడియో తీయ‌డం ప్రారంభించారు. దీన్ని గ‌మ‌నించిన న‌ర్సులు, వైద్య సిబ్బంది.. ఆ ఇద్ద‌రు యువ‌కుల‌ను ప‌ట్టుకుని ఆస్ప‌త్రిలోని ఓ గ‌దిలో బంధించారు. సెల్‌ఫోన్ల‌లో తీసిన వీడియోల‌ను డిలీట్ చేయాలంటూ క‌ర్ర‌ల‌తో కొట్టారు.

ఒక నర్సు ఇద్దరు యువకులను కర్రతో ఒకరి తర్వాత ఇంకొక‌రిని కొడుతుండ‌గా.. ఆమెకు మ‌ద్ద‌తుగా ఇంకొ న‌ర్సు నిల‌బ‌డి ఉండ‌డం వీడియోలో క‌నిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ జోక్యంతో వారిని విడుదల చేసినట్లు చెబుతున్నారు.

ప‌లువురు నెటిజ‌న్లు బిహార్ ఆరోగ్య శాఖకు వీడియోను ట్యాగ్ చేశారు. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొంద‌రు నెటిజ‌న్లు దీనిపై మ‌రొర‌కంగా స్పందించారు. ఆ ఇద్ద‌రు యువ‌కులు న‌ర్సుల‌తో అమ‌ర్యాద‌క‌రంగా ప్ర‌వ‌ర్తించార‌ని, న‌ర్సులు చేసిన ప‌ని క‌రెక్టేన‌ని అంటున్నారు.

Next Story