మార్కెట్‌లోకి మరో కొత్త బాబా..నేలపై పాకుతూ, ఆ దోషాలు తొలగిస్తానంటూ రంగంలోకి! (video)

దేశంలో బాబాల వెర్రి రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా మార్కెట్‌లోకి మరో వింత బాబా వచ్చి చేరారు

By -  Knakam Karthik
Published on : 24 March 2026 10:20 PM IST

Viral News, Viral Video, Fake Baba, Superstition, Social Media Viral

మార్కెట్‌లోకి మరో కొత్త బాబా..నేలపై పాకుతూ, ఆ దోషాలు తొలగిస్తానంటూ రంగంలోకి!(video)

దేశంలో బాబాల వెర్రి రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా మార్కెట్‌లోకి మరో వింత బాబా వచ్చి చేరారు. ఈయనను భక్తులు ముద్దుగా 'పాకుడు బాబా' అని పిలుచుకుంటున్నారు. నాగదోషాలు తొలగిస్తానంటూ రంగంలోకి దిగిన ఈ బాబా.. భక్తులను ఆకర్షించడానికి ఎంచుకున్న మార్గం చూసి సామాన్యులు అవాక్కవుతున్నారు.

సాధారణంగా ఎవరైనా నడిచి వెళ్తారు, కానీ ఈ బాబా మాత్రం పాములాగే నేలపై పాకుతూ వెళ్లడమే తన ప్రత్యేకత అని చాటుకుంటున్నారు. ఆ పాకుడు విధానం చూసి పాములు కూడా నివ్వెరపోయేలా ఉండటంతో, అమాయక జనం ఇది ఏదో దైవ శక్తి అని నమ్మేస్తున్నారు. బాబా పాకుతుంటే, అది చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్న భక్తులు ఆయన పాదాలకు (లేదా పాకే ఒంటికి) మొక్కేందుకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 'పాకుడు బాబా' వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story