Medchal: కారు ఢీ.. 10 మీటర్లు ఎగిరి పడ్డాడు.. వీడియో

మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోన్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీ కొట్టింది.

By అంజి  Published on  15 July 2024 5:30 AM
Medchal, Hyderabad, RoadSafety, road accident

Medchal: కారు ఢీ.. 10 మీటర్లు ఎగిరి పడ్డాడు.. వీడియో

మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోన్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీ కొట్టింది. దీంతో అతను గాల్లోకి ఎగిరి 10 మీటర్ల దూరంలో పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

అతడిని కారు ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జూలై 14న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 38 ఏళ్ల వయస్సు గల గిరిబాబు.. ఘట్‌కేసర్ వైపు వెళ్లేందుకు ఎన్టీపీసీ ఎక్స్‌ రోడ్డు సమీపంలో NH-163 రోడ్డును కాలినడకన దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిది ఆర్‌జీకే కాలనీ, అన్నోజిగూడ.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ''ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు డ్రైవర్ నిందితుడు కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో గాయపడిన వ్యక్తి రోడ్డుపై పడిపోవడంతో తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే ఫిర్యాదుదారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వజ్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.'' కారు డ్రైవర్‌పై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫోన్‌ మాట్లాడుతూ, ఇయర్‌ ఫోన్స్‌లో పాటలు వింటూ రోడ్లపై నడవడం, క్రాస్‌ చేయడం, వెహికల్స్‌ డ్రైవ్‌ చేయడం ప్రమాదకరం.

Next Story