రద్దీగా ఉండే రైలులో ప్రయాణించడం అత్యంత కష్టమైన పని. కదలడానికి కనీసం ఖాళీ కూడా లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ప్రయాణికులకు సీటు కూడా లభించదు. నిలబడి కూడా ప్రయాణించాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రయాణీకులకు సీటు లభించనప్పుడు, కొందరు ట్రైన్ లలో ఖాలీ ప్రాంతంలో పడుకునేస్తూ ఉంటారు. బాత్ రూమ్ కు వెళ్ళినప్పుడో.. పక్క బోగీ లోకి వెళ్ళినప్పుడో.. తిరిగి అలాంటి వారినందరినీ దాటుకుని మన సీట్లలోకి వెళ్లడం కూడా చాలా కష్టమైన పని.. అలాంటి సమస్యకు ఓ యువకుడు పరిష్కారాన్ని కనుగొన్నాడు.
రద్దీగా ఉండే రైలులో ఒక యువకుడు చిన్న టెక్నిక్‌ని ఉపయోగించడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే కంపార్ట్‌మెంట్‌లో పురుషులు, మహిళలు నేలపై పడుకుని ఉన్నారు. ఆ వ్యక్తి తన సీటుకు చేరుకోవాల్సినప్పుడు చాలానే కష్టపడ్డాడు. హ్యాండ్‌రెస్ట్ సహాయంతో ఊగుతూ రైల్వే కంపార్ట్‌మెంట్ లో తన సీటుకు చేరుకున్నాడు.