స్టేజిపై శివుని పాత్ర పోషిస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా కుప్పకూలాడు.. వీడియో వైరల్

Man playing Lord Shiva dies on Ramlila stage in UttarPradesh. ఉత్తరప్రదేశ్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మచ్లిషహర్‌లోని రాంలీలాలో శివుడి పాత్రను పోషిస్తున్న

By అంజి  Published on  12 Oct 2022 6:01 AM GMT
స్టేజిపై శివుని పాత్ర పోషిస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా కుప్పకూలాడు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మచ్లిషహర్‌లోని రాంలీలాలో శివుడి పాత్రను పోషిస్తున్న ఓ వ్యక్తి.. వేదికపై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే గుండెపోటుతో మరణించాడు. రామ్ ప్రసాద్ అకా చబ్బన్ పాండే అనే వ్యక్తి గత ఆరేళ్ల నుంచి శివుడి పాత్రలో నటిస్తున్నాడు. రామ్ ప్రసాద్ మరణంతో రాంలీలాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బెలాసిన్‌ గ్రామంలో సోమవారం హారతి చేస్తుండగా రామ్‌ప్రసాద్‌ ఛాతీ పట్టుకుని ఒక్కసారిగా కిందపడ్డాడు.

వెంటనే రామ్‌ ప్రసాద్‌ను సమీపంలోని వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి ఘటనల్లో హనుమంతుడిగానూ, రావణుడిగానూ నటిస్తున్న ఇద్దరు కళాకారులు గత పదిరోజులుగా రాంలీలాలో ప్రదర్శన ఇస్తూ మరణించిన సంగతి తెలిసిందే. రావణుడి పాత్రలో నటిస్తున్న 60 ఏళ్ల పతిరామ్ అయోధ్యలోని ఐహార్ గ్రామంలో రాంలీలా చిత్రీకరణ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురై చనిపోయాడు. అంతకుముందు ఫతేపూర్‌లో జరిగిన మరొక సంఘటనలో రామ్ స్వరూప్ వేదికపై హనుమంతుని పాత్రను పోషిస్తుండగా మరణించాడు.

Next Story