ఆత్మ‌హత్య చేసుకుందామ‌ని ఆరో అంత‌స్తు నుంచి దూకాడు.. నూక‌లు ఉన్నాయి

Man jumps from sixth floor of Mantralaya building of Maharashtra.మంత్రాలయలోని ఆరోఅంతస్తు నుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2022 7:04 AM GMT
ఆత్మ‌హత్య చేసుకుందామ‌ని ఆరో అంత‌స్తు నుంచి దూకాడు.. నూక‌లు ఉన్నాయి

దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం మంత్రాలయలోని ఆరో అంతస్తు నుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే.. ఆ భ‌వ‌నానికి ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌లో చిక్కుకుని బ‌తికిపోయాడు.

అత‌డు ఓ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ బాపు మొకాషి (43) గా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకాడు. అయితే.. ప‌రిర‌క్ష‌ణ నిమిత్తం ఏర్పాటు చేసిన వ‌ల‌లో ప‌డ్డాడు. అత‌డి ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో అరిచి గోల చేశాడు. అత‌డిని స‌ముదాయించి సేఫ్టీ నెట్‌లోంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. అనంత‌రం అత‌డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అత‌డు ఎందుకు ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు అనే కార‌ణం మాత్రం తెలియ‌దు. అయితే.. అందుకున్న నివేదిక‌ల ప్ర‌కారం.. అత‌డికి కాబోయే భార్య‌పై అత్యాచారం జ‌రిగింద‌ని, నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డంలో విఫ‌లం అయ్యార‌ని, ఉద్ద‌వ్ సీఎం గా ఉన్న‌ప్పుడు నాలుగు సార్లు లేఖ‌లు రాసినా ఫ‌లితం లేక‌పోయింద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

కాగా.. గ‌తంలో న‌లుగురు వ్య‌క్తులు ఈ భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో భ‌వ‌నం మ‌ధ్య గ‌ల ఖాళీ స్థ‌లంతో పాటు చుట్టూ ర‌క్ష‌ణ వ‌ల ఏర్పాటు చేయాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో ప‌రిపాల‌న భ‌వ‌నం చుట్టూ, మ‌ధ్య‌లో ఉన్న ప‌దివేల చ‌ద‌ర‌పు అడుగుల ఖాళీ స్థ‌లంపై ధృఢ‌మైన ర‌క్ష‌ణ వ‌ల‌ను ఏర్పాటు చేశారు. అప్ప‌టి నుంచి ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌లు త‌గ్గాయి.

Next Story