బాత్‌రూమ్‌లో పాముకు స్నానం చేయించిన వ్యక్తి.. వీడియో వైరల్‌

Man gives bath to snake in viral video, shocks netizens. సాధారణంగా పాము కనబడితే అల్లంతా దూరం పరుగుపెడతాం. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఎవ్వరూ

By అంజి  Published on  4 Dec 2022 11:43 AM GMT
బాత్‌రూమ్‌లో పాముకు స్నానం చేయించిన వ్యక్తి.. వీడియో వైరల్‌

సాధారణంగా పాము కనబడితే అల్లంతా దూరం పరుగుపెడతాం. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఎవ్వరూ చేయలేని పని చేశాడు. ఏకంగా పాముకు స్నానం చేయించాడు. బాత్‌రూమ్‌లో ఓ వ్యక్తి నాగుపాముకి స్నానం చేయిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆశ్చర్యపరుస్తోంది. ట్విట్టర్ వినియోగదారు జిందగీ గుల్జార్ హై వీడియో ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. 22 సెకన్ల నిడివి గల వీడియోలో.. బాత్‌రూమ్‌లో ఒక వ్యక్తి.. పాముపై మగ్‌తో నీరు పోశాడు.

ఆ తర్వాత అత్యంత విషపూరితమైన నాగు పాము శరీరాన్ని రుద్ది శుభ్రం చేశాడు. నాగుపాము తన నోటితో కప్పును పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 24వేలకు పైగా వీక్షణలను పొందింది. "ఈ చలిలో పేద పాముకి నీళ్లతో స్నానం చేయిస్తున్నాను" అని వీడియోకు క్యాప్షన్ ఉంది. అయితే ఈ వీడియో, ఎప్పుడు ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.

Next Story