పెట్రోల్ నోట్లో వేసుకుని ఊదాడు.. చివరికి..!

Man Attempts A Risky Fire Stunt, Beard Catches Fire. ఓ వ్యక్తి చేసిన స్టంట్ లో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో

By Medi Samrat  Published on  30 Oct 2022 2:53 PM IST
పెట్రోల్ నోట్లో వేసుకుని ఊదాడు.. చివరికి..!

ఓ వ్యక్తి చేసిన స్టంట్ లో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఒక వ్యక్తి పూజా పండల్‌లో చేతిలో నిప్పు ఉన్న కర్రతో ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్నట్లు చూపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత, ఆ వ్యక్తి పెట్రోల్‌ను నోట్లో వేసుకుంది మంటల వైపు ఊదాడు. ఈ ఊహించని పరిణామంలో, అతను కర్రను నేలపై విసిరిన వెంటనే, అతని గడ్డం మంటలను అంటుకుంటుంది. అక్కడే ఉన్న వ్యక్తులు వెంటనే ఆ వ్యక్తికి సహాయం చేయడానికి వచ్చారు. ఆ వ్యక్తి ముఖంపై చాలాసార్లు కొట్టి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.

తేదీ లేని ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రవి పాటిదార్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారనేది స్పష్టంగా తెలియరాలేదు. అక్టోబర్ 6న పోస్ట్ చేసిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 12.3 మిలియన్ల వ్యూస్ ను పొందింది. సోషల్ మీడియా యూజర్లు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేసినందుకు ఆ వ్యక్తిని తిట్టారు.


Next Story