అసలైన ఆణిముత్యం : 500 మంది అమ్మాయిలు.. ఒక్కడే అబ్బాయి.. కట్ చేస్తే ఆస్పత్రిలో.. ఏం జరిగిందంటే..?
Male student faints after finding himself among 500 girls in Bihar exam centre.బీహార్ రాష్ట్రంలో బుధవారం నుంచి పబ్లిక్
By తోట వంశీ కుమార్ Published on 2 Feb 2023 2:43 AM GMTబీహార్ రాష్ట్రంలో బుధవారం(ఫిబ్రవరి1 ) నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్ష ప్రారంభం రోజే ఓ విద్యార్థి పరీక్ష కేంద్రంలో స్పృహ తప్పి పడిపోయాడు. పరీక్ష ఒత్తిడి కారణంగా అలా జరిగి ఉంటుందని మీరు బావిస్తే పప్పులో కాలేసినట్లే. ఆ పరీక్షా కేంద్రంలో అతడు ఒక్కడే అబ్బాయి కాగా.. మిగిలిన వారంతా అమ్మాయిలే. అంత మంది అమ్మాయిల మధ్యలో తాను ఒక్కడినే అబ్బాయి అన్న సంగతి తెలిసి ఏకంగా స్పృహ కోల్పోయాడు. ఈ ఘటన నలందాలో జరిగింది.
అల్లమా ఇక్బాల్ కాలేజీలో మనీష్ శంకర్ అనే విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మనీష్ శంకర్‌కు బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌లో ఎగ్జామ్ సెంటర్ పడింది. దీంతో అతడి తండ్రి సచ్చినాంద్ ప్రసాద్ సుందరగడ్‌లోని పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చాడు. అయితే.. లోనికి వెళ్లిన మనీష్‌కు షాక్ తగిలినంత పనైంది.
పరీక్షా కేంద్రంలో అందరూ అమ్మాయిలే ఉన్నారు. తాను తప్ప మరో అబ్బాయి అక్కడ లేడు. దాదాపు 500 మంది అమ్మాయిలు ఉన్నారు. పరీక్ష హాల్‌లోకి వెళ్లిన అతడిని చూసి అక్కడ ఉన్న అమ్మాయిలు ఒక్కసారిగా ఘోల్లుమన్నారు. ఏమీ అర్థంకాని అయోమయంలో పడిపోయిన మనీష్ కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే పరీక్షా కేంద్రం నిర్వాహకులు అతడిని సర్దార్ ఆస్పత్రికి తరలించారు.
వందలాది మంది ఆడపిల్లలు ఒక్కసారిగా చూసి కంగారు పడ్డాడు. అందుకే స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. పూర్తిగా అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన ఈ పరీక్ష కేంద్రంలో పొరపాటున మనీష్‌కు కేటాయింపు జరిగిందని అధికారులు చెబుతున్నారు.
పేపర్ లీక్ వార్త..
బుధవారం పరీక్ష ప్రారంభం కావడానికి అరగంట ముందు ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. గణితం పరీక్ష మరో అరగంటలో ప్రారంభం అవుతుంది అనగా పేపర్ లీక్ వార్త కలకలం రేపింది. అయితే.. లీకైన పశ్నపత్రంతో పోల్చి చూస్తే ఒరిజినల్ ప్రశ్నాపత్నంలోని ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న కూడా కలవలేదు. ఈ పరీక్షకు 13 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు.