Video : రోడ్డుపై నిద్రిస్తున్న కుక్కపై చిరుతపులి దాడి.. తోటి కుక్క‌లు ఏం చేశాయంటే..?

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రాత్రిపూట రోడ్డుపై నిద్రిస్తున్న కుక్కపై చిరుతపులి దాడి చేసిన క్షణాలు CCTVలో రికార్డు అయ్యాయి.

By Medi Samrat
Published on : 15 May 2025 7:52 PM IST

Video : రోడ్డుపై నిద్రిస్తున్న కుక్కపై చిరుతపులి దాడి.. తోటి కుక్క‌లు ఏం చేశాయంటే..?

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రాత్రిపూట రోడ్డుపై నిద్రిస్తున్న కుక్కపై చిరుతపులి దాడి చేసిన క్షణాలు CCTVలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. BHEL టౌన్‌షిప్‌లో జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో చిరుతపులి అకస్మాత్తుగా రోడ్డుపై పడుకున్న కుక్కపైకి దూకింది. అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, ఒక కుక్కల గుంపు రక్షించడానికి పరుగెత్తుకుని వచ్చింది.

ఈ సంఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం ఇంకా నిర్ధారించనప్పటికీ, రాజాజీ టైగర్ రిజర్వ్ సరిహద్దులో ఉన్న బిహెచ్ఇఎల్ ప్రాంతంలో ఇది జరిగిందని అంటున్నారు. ఈ ప్రాంతంలో చిరుతపులులు సహా పలు అడవి జంతువులు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ఈ సంఘటన స్థానికులలో భయాందోళనలను పెంచింది.

Next Story