అక్కడ చేతి పంపు కొడితే చాలు.. బకెట్ల కొద్దీ మద్యం బయటకు.. వీడియో వైరల్
In Madhya Pradesh, when the police hit a hand pump, alcohol came out. సాధారణంగా చేతి పంపు కొడితే నీరు వస్తుంది. కానీ అక్కడ మాత్రం అలా కాదు. అక్కడ చేతి పంపు కొడితే.. మద్యం బకెట్ల కొద్దీ
By అంజి Published on 11 Oct 2022 1:31 PM ISTసాధారణంగా చేతి పంపు కొడితే నీరు వస్తుంది. కానీ అక్కడ మాత్రం అలా కాదు. అక్కడ చేతి పంపు కొడితే.. మద్యం బకెట్ల కొద్దీ బయటకు వస్తోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణాలో వెలుగు చూసింది. సోమవారం పోలీసులు అక్రమ మద్యం స్థావరంపై దాడి చేసి సుమారు 6 వేల లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భాన్‌పురా వద్ద, నిందితులు భూమిలో ట్యాంక్‌ను పూడ్చిపెట్టి, చేతి పంపును అమర్చారు. ఇది పోలీసుల కంట పడింది. వారు చేతి పంపును కొట్టి చూడా మద్యం బయటకు వచ్చింది. ఇది చూసిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న బిగ్ క్యాంపెయిన్.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ, స్థానిక యంత్రాంగం దాడులు నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు దాడులు నిర్వహించగా.. గుణాలో ఉన్న ఓ చేతిపంపులో నీరు కాకుండా మద్యం బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుణాలో లిక్కర్ మాఫియా.. మద్యాన్ని పంప్ చేయడానికి చేతి పంపును అమర్చింది. ఇది గమనించిన పోలీసులు చేతి పంపు కొట్టగానే మద్యం బయటకు రావడం మొదలైంది.
MP में इन दिनों नशे के खिलाफ अभियान चलाया जा रहा है. CM शिवराज के निर्देश के बाद पुलिस, आबकारी विभाग और स्थानीय प्रशासन अलग-अलग जिलों में छापेमारी कर रहा है. इसी सिलसिले में पुलिस ने जब गुना में छापा मारा तो उनको एक ऐसा हैंडपंप मिला, जिससे पानी नहीं बल्कि शराब निकल रही थी. pic.twitter.com/FLUd37qJ2T
— Kumar Abhishek (@active_abhi) October 11, 2022
వివిధ ప్రాంతాల్లో ఆరుగురు వ్యక్తులపై ఎంపీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అక్రమ మద్యం విక్రయిస్తున్న మాఫియాలపై ఎంపీ పోలీసులు చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు, పోలీసులు, ఎక్సైజ్ శాఖలు కూడా అనేక ప్రధాన దాడుల్లో వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నట్లు పోలీసుల ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమవుతోంది. సీఎం శివరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్‌తో అక్రమ మద్యం వ్యాపారాన్ని చాలా వరకు అరికట్టవచ్చు.