Hyderabad: నాకు సీఎం ఇల్లు కావాలి.. యువతి వీడియో వైరల్‌

హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్ట్‌ నిర్వాసితుల్లో ఒకరైన యువతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కర్ణాటక నుంచి వచ్చి ఉంటున్నానని, ఇక్కడే ఇల్లు కొనుక్కొని, కష్టపడి ఈఎంఐ కడుతున్నానని తెలిపారు.

By అంజి  Published on  18 Nov 2024 10:53 AM IST
Hyderabad, CM Revanth, CMs house, young woman, viral news

Hyderabad: నాకు సీఎం ఇల్లు కావాలి.. యువతి వీడియో వైరల్‌

హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్ట్‌ నిర్వాసితుల్లో ఒకరైన యువతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కర్ణాటక నుంచి వచ్చి ఉంటున్నానని, ఇక్కడే ఇల్లు కొనుక్కొని, కష్టపడి ఈఎంఐ కడుతున్నానని తెలిపారు. తెలుగు కూడా నేర్చుకున్నానని, అందరూ పరిహారం వద్దు అంటున్నారని, తనకు మాత్రం పరిహారం కావాలన్నారు. తనకు పరిహారంగా సీఎం ఇల్లు కావాలని, తన ఇల్లును సీఎం ఇస్తానన్నారు.

''నా ఇల్లు సీఎంకు ఇస్తా.. నాకు సీఎం ఇల్లు కావాలి. అదే నాకు పరిహారం. ఇస్తారా మాకు? ఇస్తే రేపే నా ఇల్లు ఖాళీ చేస్తా. లేదంటే చేయను'' అంటూ యువతి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే.. మూసీ ప్రాజెక్టును ఆపేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఫొటో షూట్‌ కోసం నిద్ర చేశారని ఎద్దేవా చేశారు. ఆయన బస చేసే ముందు.. ఆ ప్రాంతంలో దోమల, ఈగల మందు పిచికారీ చేయించారని విమర్శించారు.

Next Story