మధ్యప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసి, ఒకరినొకరు కొట్టుకోవడం, జుట్టు పట్టుకుని లాగడం వరకూ దారితీసింది. వారి గొడవ వీడియో వైరల్ కావడంతో ఆ ఇద్దరు మహిళలను విధుల నుంచి తొలగించారు. వారు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
రాజధాని భోపాల్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లోని ఏకలవ్య ఆదర్శ్ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. వీడియోలో, ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ బిగ్గరగా వాదించుకుంటున్నట్లు చూడవచ్చు. లైబ్రేరియన్ తన ఫోన్‌లో రికార్డ్ చేయడం మొదలు పెట్టింది. కోపంతో ప్రిన్సిపాల్ ఆమెను చెంపదెబ్బ కొట్టి, ఫోన్‌ను లాక్కొని నేలకేసి విసిరేసింది. ఆ తర్వాత మరోసారి కూడా కింద పడిన ఫోన్ ను తీసుకుని మరోసారి నేలకేసి కొట్టింది ప్రిన్సిపాల్. నన్ను ఎందుకు కొత్తవంటూ లైబ్రేరియన్ ప్రిన్సిపాల్ మీద తిరగబడడంతో ఒకరినొకరు జుట్టు పట్టుకుని లాక్కున్నారు. అక్కడే ఉన్న వారు ఈ గొడవను అడ్డుకోడానికి ప్రయత్నించారు.