టీచర్‌ను 18 సార్లు చెంపదెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
గుజరాత్‌లోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు.. ఉపాధ్యాయుడిని కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
By అంజి Published on 10 Feb 2025 9:16 AM IST
టీచర్‌ను 18 సార్లు చెంపదెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
గుజరాత్‌లోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు.. ఉపాధ్యాయుడిని కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భరూచ్ జిల్లాలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్.. ఉపాధ్యాయుడిని 18 సార్లు చెంపదెబ్బ కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దీనితో విద్యాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నవయుగ్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. అక్కడ ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్ ఉపాధ్యాయుడు రాజేంద్ర పర్మార్‌ను కొట్టడం కనిపించింది. రాజేంద్ర పర్మార్ గణితం, సైన్స్ పాఠాలను నిర్వహించడంపై వచ్చిన ఫిర్యాదుల నుండి ఈ వివాదం తలెత్తిందని తెలుస్తోంది.
ఠాకూర్.. పర్మార్ ను తరగతి గదిలో అనుచితంగా ప్రవర్తించాడని, దుర్భాషలాడాడని ఆరోపించాడు. పర్మార్.. పాఠశాల సమావేశంలో కోపంతో ప్రిన్సిపాల్ తనపై దాడి చేశాడని ఆరోపించాడు. వీడియో ప్రసారం అయిన తర్వాత, జిల్లా విద్యాశాఖ అధికారి స్వాతిబా రౌల్ ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఏదైనా చర్య తీసుకునే ముందు విద్యా ఇన్స్పెక్టర్ నివేదికను సమర్పిస్తారు. సమావేశంలో ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఠాకూర్ తన పాదాలకు మసాజ్ చేయించుకున్నాడని పర్మార్ చెప్పగా, పర్మార్ విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించాడని ఠాకూర్ ఆరోపించాడు.
#FitIndiaSuperhitBulletin: गुजरात के भरूच में प्रिंसिपल-टीचर के बीच मारपीट.. शिक्षक की पिटाई #CCTV में कैद@iamdeepikayadav @Sakshijournalis #GujaratNews #Crime pic.twitter.com/ATTGuurwRL
— Times Now Navbharat (@TNNavbharat) February 9, 2025