Video: అనుకోకుండా ఎదురుపడిన మనిషి, సింహం..తర్వాత ఏం జరిగిందో తెలుసా?

గుజరాత్‌లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో ఊహించని ఒక ఘటన చోటు చేసుకుంది

By Knakam Karthik
Published on : 11 Aug 2025 1:59 PM IST

Viral Video, Gujarat, man and lion

Video: అనుకోకుండా ఎదురుపడిన మనిషి, సింహం..తర్వాత ఏం జరిగిందో తెలుసా?

గుజరాత్‌లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో ఊహించని ఒక ఘటన చోటు చేసుకుంది. ఓ మనిషి, సింహం పరస్పరం ఎదురుపడి పరుగులు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా దుంగార్‌పూర్‌లోని పటాపూర్ గ్రామంలోని ఆధార్ సిమెంట్ ఫ్యాక్టరీ గేటు దగ్గర ఈ సంఘటన జరిగింది. ఆ క్లిప్‌లో ఆ వ్యక్తి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చి సింహాన్ని ముఖాముఖిగా చూస్తున్నట్లు చూపిస్తుంది. ఆశ్చర్యపోయిన అతను ఆ ప్రాంగణం వైపు వేగంగా పరిగెత్తాడు, సింహం కూడా అంతే భయపడి సమీపంలోని అడవి వైపు పరుగెత్తింది.

కాగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో సింహం ఒక పక్క, మనిషి ఇంకో పక్క నడుస్తూ వస్తున్నారు. మధ్యలో చిన్న బిల్డింగ్ అడ్డుగా ఉంది. ఇద్దరూ దానిని దాటి ఒకరినొకరు చూడగానే భయంతో పరుగు తీశారు. జునాగఢ్ లో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఘటన జరగ్గా అది కాస్తా అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. సింహం మనిషిని చూసి భయపడిందా అంటే.. అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరూ లేని ప్రశాంతంగా నడుస్తూ పోతున్న దానికి.. అకస్మాత్తుగా ఒక వ్యక్తి కనిపించేసరికి భయపడిందని చెప్పొచ్చు. అయితే దీనిని సుశాంత నంద ఎలిమెంట్ ఆఫ్ సర్‌ప్రైజ్‌గా చెప్పారు.

సంఘటన గురించి ఫ్యాక్టరీ యజమాని సాగర్ కోటేచా మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో చాలా రోజులుగా సింహాలు కనిపిస్తున్నాయని అన్నారు. "ఇది అటవీ ప్రాంతం కాబట్టి, రాత్రిపూట లేదా తెల్లవారుజామున సింహాలు కనిపించడం సర్వసాధారణం. కానీ ఆ రాత్రి సమయంలో సింహాలు అంత దగ్గరగా కనిపించడం అసాధారణం. ఆ వ్యక్తి భయపడి వెనక్కి పరిగెత్తాడు, సింహం కూడా అంతే త్వరగా వెనక్కి తిరిగింది" అని ఆయన అన్నారు. సింహాలు తరచుగా ఫ్యాక్టరీ గేటు గుండా వెళతాయని, కానీ ఎవరికీ హాని చేయలేదని కోటేచా అన్నారు. "ఒక సింహం మీ దారికి అడ్డంగా ఉంటే, అది ఇక్కడ ఎంత సాధారణమైనప్పటికీ, మీరు భయపడకుండా ఉండలేరు" అని ఆయన అన్నారు.

Next Story