సోదరుడితో గొడవపడి సెల్‌ఫోన్ మింగేసింది.. చివరికేమైందంటే?
18 ఏళ్ల యువతి తన సోదరుడితో గొడవ పడుతున్న సమయంలో ఆవేశంలో సెల్ ఫోన్ మింగడంతో అత్యవసర శస్త్రచికిత్స
By అంజి Published on 7 April 2023 8:05 AM ISTసోదరుడితో గొడవపడి సెల్‌ఫోన్ మింగేసింది.. చివరికేమైందంటే?
18 ఏళ్ల యువతి తన సోదరుడితో గొడవ పడుతున్న సమయంలో ఆవేశంలో సెల్ ఫోన్ మింగడంతో అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో గత శుక్రవారం చోటు చేసుకుంది. 'తోబుట్టువుల మధ్య వివాదంతో యువతి సెల్ ఫోన్ మింగే ఘటనకు దారి తీసింది' అని సర్జరీలో పాల్గొన్న ఒక పేరు చెప్పని వైద్యుడు తెలిపారు. సోదరుడు, సోదరి.. చైనీస్ సెల్‌ఫోన్ విషయమై గొడవ పడ్డారు. దీంతో మనస్థాపం చెందిన యువతి మొబైల్ ఫోన్‌ను మింగేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర కడుపు నొప్పి రావడం ప్రారంభించింది. యువతి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే యువతిని గ్వాలియర్‌లోని జయారోగ్య ఆస్పత్రికి తరలించారు.
ఆ వెంటనే సర్జన్లు సిటీ స్కాన్, ఎక్స్-రే, అల్ట్రాసౌండ్‌తో సహా యువతికి పలు టెస్టులు చేశారు. ఎండోస్కోపీ వంటి తక్కువ ఇన్వాసివ్ పద్ధతుల ద్వారా ఫోన్‌ను సంగ్రహించలేమని వారు నిర్ధారించారు. చివరికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అదృష్టవశాత్తూ, రెండు గంటలపాటు సాగిన ఆపరేషన్ తర్వాత.. బృందం రోగి శరీరం నుండి ఫోన్‌ను తిరిగి పొందగలిగిందని ప్రిసైడింగ్ సర్జన్ డాక్టర్ నవీన్ కుష్వా తెలిపారు. యువతికి 10 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆమె త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. వైద్యుడిగా తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి కేసును ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని డాక్టర్ కుష్వా చెప్పారు. విచిత్రమైన సంఘటన వెలుగులో వచ్చిన తర్వాత యుక్తవయస్సు వారికి మొబైల్ పరికరాలను అప్పగించే ముందు జాగ్రత్త వహించమని సర్జన్ తల్లిదండ్రులను కోరాడు.