Video : ఓ పక్క సినిమా రన్ అవుతుంది.. మరోపక్క మంటలు చెలరేగాయి..!
ఢిల్లీలోని ఓ మాల్‌లోని సినిమా హాలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 26 Feb 2025 7:13 PM IST
ఢిల్లీలోని ఓ మాల్‌లోని సినిమా హాలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుధవారం ఇక్కడి సెలెక్ట్ సిటీ మాల్‌లోని ఓ సినిమా హాలులో సినిమా ప్రదర్శన సందర్భంగా మంటలు చెలరేగాయి. సాయంత్రం 4:15 గంటలకు మాల్‌లోని పివిఆర్ సినిమాస్ సినిమా స్క్రీన్‌లో 'ఛావా' సినిమా ప్రదర్శన సందర్భంగా మంటలు చెలరేగాయని, దీంతో సినీ ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షి ఒకరు పీటీఐకి తెలిపారు.
VIDEO | A fire broke out at a cinema hall in Delhi's Select CityWalk Mall during the screening of the film 'Chhava' earlier today. As fire alarms started ringing in the hall, everybody rushed to the exit doors. The cinema hall was evacuated.
— Press Trust of India (@PTI_News) February 26, 2025
(Source: Third Party)
(Full video… pic.twitter.com/eAqcJ7WzND
సాయంత్రం 5.42 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. మరో సినీ ప్రేక్షకుడు మాట్లాడుతూ.. హాలులో ఫైర్ అలారం మోగడం ప్రారంభమైంది, అందరూ ఎగ్జిట్ డోర్‌ల వద్దకు పరుగెత్తారు. సినిమా హాలు ఖాళీ చేయబడిందని పేర్కొన్నాడు.