రెండు గ్రూపులకు చెందిన న్యాయవాదులు కోర్టు హాలు లోపల పరస్పర దాడులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయస్థానంలో పోటాపోటీగా వాదనలకు బదులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఒక వివాదంపై చెలరేగిన ఘర్షణ ఢిల్లీలోని స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగినట్లు సమాచారం. అయితే ఈ గొడవ దృశ్యాలను అక్కడున్న కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది కాస్త వైరల్ అయ్యింది.
కోర్టు లోపల పురుష, మహిళా న్యాయవాదులు ఒకరినొకరు చెప్పులు, నేమ్‌ప్లేట్‌తో దాడి చేసుకుంటున్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే గొడవకు కారణమేంటని ఆరా తీస్తే.. క్లయింట్లను సంపాదించుకోవడంలో వివాదం తర్వాత రెండు గ్రూపుల న్యాయవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడున్న పోలీసులతో కొందరు చూసీ చూడనట్లు ఉన్నారు. ఆ ఘర్షణ కాస్త ఎక్కువయ్యి రక్తస్రావం జరగడంతో అప్పుడు స్పందించి వారిని విడిపించారు.