Viral Video : గొడవపడ్డ ఇద్దరు అమ్మాయిలు.. అబ్బాయిలు ఏం చేశారంటే..
అమ్మాయిలు గొడవ పడుతున్న వీడియోలు ఈ మధ్య చాలానే వైరల్ అవుతున్నాయి. తాజాగా నోయిడాలోని ఓ కాలేజీ క్యాంటీన్‌లో ఇద్దరు అమ్మాయిలు గొడవపడ్డారు.
By Medi Samrat Published on 23 July 2024 5:50 PM ISTఅమ్మాయిలు గొడవ పడుతున్న వీడియోలు ఈ మధ్య చాలానే వైరల్ అవుతున్నాయి. తాజాగా నోయిడాలోని ఓ కాలేజీ క్యాంటీన్‌లో ఇద్దరు అమ్మాయిలు గొడవపడ్డారు. అమ్మాయిలిద్దరూ గొడవపడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో నోయిడా సెక్టార్-126 కొత్వాలీలో ఉన్న అమిటీ యూనివర్సిటీ క్యాంటీన్‌లోనిది. ఈ ఘటనపై విచారించిప పోలీసులు చర్యలు చేపట్టారు.
వైరల్ అవుతున్న 30 సెకన్ల వీడియోలో.. ఇద్దరు అమ్మాయిలు ఒకరి కాలర్ ఒకరు పట్టుకుకి కొట్టుకుంటున్నారు. ఒక అమ్మాయి నల్లటి టీ షర్టు, మరొకరు చెక్ షర్ట్ ధరించి ఉన్నారు.
అసభ్య పదజాలం వాడటం వల్ల ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు చెబుతున్నారు. నల్లటి దుస్తులలో ఉన్న అమ్మాయి చెక్ షర్ట్‌లో ఉన్న అమ్మాయిని టేబుల్‌పై పడేసింది. ఇద్దరూ టేబుల్ మీద నుండి నేలమీద పడి కొట్టుకుంటున్నారు.
कितनी मेहनत से पढ़ाई कर रहे हैं बच्चे आगे तो बढ़ेंगे ही, वायरल वीडियो नामी यूनिवर्सिटी बताई जा रही है ,#Amity_University की कैंटीन में दो छात्रा आपसे में भिड़ी, दोनों युवतियों के बीच हुई मारपीट,मारपीट का वीडियो सोशल मीडिया पर हुआ वायरल, नोएडा की Amity University का बताया जा रहा… pic.twitter.com/H8ZyRoHPww
— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) July 23, 2024
వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న యువకులు నవ్వుతూ.. అరుస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలకు కత్తి ఇవ్వాలని అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా పక్కన ఉన్న వాళ్లు ఏమనుకుంటారోననే కనీస జ్ఞానం లేకుండా కిందపడి మరీ కొట్టుకుంటున్నారు. టేబుల్ విరిగినా వారి గొడవ ఆగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కొత్వాలి పోలీసులు కంట పడింది. వీడియోపై సమాచారం తీసుకుని విచారణ జరుపుతున్నారు.