ఇంగ్లీష్ సింగర్ నోట, జై శ్రీరామ్ మాట: వీడియో

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన కోల్డ్ ప్లే బ్యాండ్ కన్సర్ట్‌లో సింగర్ క్రిస్ మార్టిన్ జై శ్రీరామ్ అనడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.

By Knakam Karthik  Published on  19 Jan 2025 11:18 AM IST
National News, Mumabai, Chris Martin, Cold Play Music Concernt, Viral News,

ఇంగ్లీష్ సింగర్ నోట, జై శ్రీరామ్ మాట: వీడియో

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన కోల్డ్ ప్లే బ్యాండ్ కన్సర్ట్‌లో సింగర్ క్రిస్ మార్టిన్ జై శ్రీరామ్ అనడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఫ్యాన్స్‌ను తన పాటలతో అలరించిన అనంతరం ఆయన షుక్రియా, జై శ్రీరామ్ అన్న మాటలను మనం కింది వీడియోలో చూడొచ్చు. ఓ అభిమాని ప్లకార్డుపై జై శ్రీరామ్ అని రాయడంతో దానిని క్రిస్ మార్టిన్ చదివారు. అలాగే అదే ఈవెంట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి కూడా ప్రస్తావించారు. కన్సర్ట్ సమయంలో క్రిస్ మార్టిన్ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అలంరించాడు. బ్యాండ్ ప్రదర్శనలో ప్యారడైజ్, వివా లా విడా, అడ్వెంచర్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ లాంటి ప్రజాదరన పొందిన ట్రాక్‌లను ప్లే చేశారు.


తన ప్రియురాలు, హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్‌తో కలిసి క్రిస్ మార్టిన్ భారత్ సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రసిద్ధ శివాలయాన్ని సందర్శించారు. దర్శనం అనంతరం ఆలయంలోని నంది చెవిలో మార్టిన్ తన మనసులోని కోరికను వినిపించారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Next Story