బీచ్‌లో నగ్నంగా యువతి మొండెం.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..!
Dead body found on Thai tourist beach.సరదాగా గడిపేందుకు వారంతా బీచ్‌కు వెళ్లారు. సముద్రపు అలలతో కొందరు
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2022 9:13 AM ISTసరదాగా గడిపేందుకు వారంతా బీచ్‌కు వెళ్లారు. సముద్రపు అలలతో కొందరు ఆడుకుంటుండగా మరికొందరు సరదాగా నడుచుకుంటూ వెలుతున్నారు. ఇంతలో బీచ్‌లోని ఓ చోట ఇసుకపై కనిపించిన దృశ్యం చూసి అక్కడ ఉన్న వారంతా షాక్‌కు గురైయ్యారు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. ఓ యువతి దేహం తల లేకుండా అర్థనగ్నంగా కనిపించింది. ఎడమవైపునకు పడి ఉన్న ఆ యువతి తలకు కేవలం ఓ టీ షర్టు చుట్టి ఉంది. ఈ ఘటన థాయ్‌లాండ్ దేశంలోని జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ బ్యాంగ్ సీన్ బీచ్‌లో కనిపించింది ఈ దృశ్యం. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ నిపుణులను కూడా అక్కడకు పిలిపించారు. యువతిని ఎవరైనా చంపి సముద్రంలో పారేసి ఉంటారని, ఆ మృతదేహం తల లేకుండా ఒడ్డుకు కొట్టుకువచ్చి ఉంటుందని, ఆ యువతి పై అత్యాచారం కూడా జరిగి ఉంటుందని ఎవరికి వారు అనుకుంటున్నారు.
ఇంతలో ఫోరెనిక్స్ నిపుణులు చెప్పినది విని అంతా షాక్ అయ్యారు. అందరూ అనుకున్నట్లు అది యువతి మృతదేహం కాదు. అచ్చం యువతిలా పోలి ఉన్న ఓ బొమ్మ. జపాన్ దేశంలో ఇలాంటి బొమ్మలను ఎక్కువగా తయారు చేస్తుంటారు. మగాళ్లు తమ కోర్కెలను ఈ బొమ్మ సాయంతో తీర్చుకుంటారని చెప్పారు. దీని ధర దాదాపు రూ.45 వేల వరకు(భారత కరెన్సీలో) ఉంటుంది.
విషయం తెలుసుకున్న అందరూ.. అక్కడ ఉన్నది యువతి మృతదేహం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. తమలో తామే కాసేపు నవ్వుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎవరో వ్యక్తి ఆ బొమ్మతో అవసరం తీరి పోయాక సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు బావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.