ఐసీయూలో చ‌క్క‌ర్లు కొట్టిన ఆవు.. వీడియో వైర‌ల్‌

Cow strolls in ICU ward of Madhya Pradesh hospital.ఆవు ఆస్ప‌త్రిలోని ఐసీయూ వార్డులో చ‌క్క‌ర్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2022 11:42 AM IST
ఐసీయూలో చ‌క్క‌ర్లు కొట్టిన ఆవు.. వీడియో వైర‌ల్‌

అన్ని చోట్లా అని కాదు గానీ కొన్ని ఏరియాల‌లో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు వెళ్లాలంటేనే ప్ర‌జ‌లు జంకుతున్నారు. వైద్యం సంగ‌తి ఎలా ఉన్నా స‌రే అక్క‌డికి వెళ్తే కొత్త రోగులు తెచ్చుకోవాల్సి వ‌స్తుందేమోన‌న్న‌ భ‌యం మాత్రం నెల‌కొంటోంది. అందుకు కార‌ణం.. అధ్వానంగా ఉండే అక్క‌డి ప‌రిస‌రాలే కార‌ణం. ఆస్ప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ ఆవు ఆస్ప‌త్రిలోని ఐసీయూ వార్డులో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఉన్న ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని ఐసీయూ వార్డులోకి ఆవు వ‌చ్చింది. ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఉన్న చెత్త డ‌బ్బాలో ఉన్న మెడిక‌ల్ వ్య‌ర్థాల‌ను తినింది. కాసేపు అక్క‌డే చ‌క్క‌ర్లు కొట్టింది. దీంతో అక్క‌డ చికిత్స పొందుతున్న పేషంట్లు ఇబ్బంది ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఆస్ప‌త్రిలో సిబ్బంది లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఆస్ప‌త్రి యాజ‌మాన్యంపై నెటీజ‌న్లు, పేషంట్ల బంధువులు మండిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌తాధికారులు స్పందించారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హించిన ఆస్ప‌త్రి ఇన్‌చార్జ్, గార్డును సస్పెండ్ చేసిన‌ట్లు జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర కటారియా తెలిపారు.

మరోవైపు ఈ ఏడాది సెప్టెంబరులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లాలో ఇలాంటి ఒక సంఘటనే చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఒక ఆసుపత్రి బెడ్‌పై ఓ వీధి కుక్క హాయిగా పడుకుంది.

Next Story