Video: పాఠశాలలో గుడ్లను దొంగిలించిన ప్రిన్సిపాల్‌ .. ఆపై..

బీహార్‌లోని వైశాలి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ చిన్నారుల మధ్యాహ్న భోజనం కోసం ఉంచిన గుడ్లను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కాడు

By అంజి  Published on  20 Dec 2024 1:20 AM GMT
Bihar, school principal, stealing eggs, children

Video: పాఠశాలలో గుడ్లను దొంగిలించిన ప్రిన్సిపాల్‌ .. ఆపై..

బీహార్‌లోని వైశాలి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ చిన్నారుల మధ్యాహ్న భోజనం కోసం ఉంచిన గుడ్లను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కాడు. ప్రిన్సిపల్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన తరువాత.. రాష్ట్ర విద్యా శాఖ ఈ విషయంపై దర్యాప్తు నిర్వహించి, ఈ సంఘటన వైశాలిలోని లాల్‌గంజ్ బ్లాక్‌లోని రిఖర్ గ్రామంలోని మిడిల్ స్కూల్‌లో జరిగిందని కనుగొంది. దొంగతనం చేసినందుకు అతనిపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని పాఠశాలా డిపార్ట్‌మెంట్.. నిందితుడు ప్రిన్సిపాల్ సురేష్ సహానీకి నోటీసు జారీ చేసింది.

విద్యా శాఖ ప్రతిష్టను సహానీ చెడగొట్టారని కూడా పేర్కొంది. డిసెంబరు 12 నాటిదిగా చెప్పబడుతున్న వీడియోలో.. ప్రిన్సిపాల్ పిల్లల మధ్యాహ్న భోజనం కోసం వచ్చిన గుడ్లను తన బ్యాగ్‌లో ఉంచి తన ఇంటికి తీసుకెళ్లడం చూడవచ్చు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ప్రిన్సిపాల్‌ను తొలగించాలంటూ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. అయితే, తాను గుడ్లను తన ఇంటికి తీసుకెళ్లలేదని, వాటిని పాఠశాల వంట మనిషికి ఇచ్చానని సురేష్ సహాని చెప్పాడు.

Next Story