ప్లాన్ ప్రకారమే ట్రంప్‌పై కాల్పులు..గన్‌ ఫైర్ చేసిన వ్యక్తి వీడియో

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  14 July 2024 10:48 AM IST
attack,  trump,   viral video,

 ప్లాన్ ప్రకారమే ట్రంప్‌పై కాల్పులు..గన్‌ ఫైర్ చేసిన వ్యక్తి వీడియో 

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొన్నప్పుడు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. కాల్పుల్లో ట్రంప్‌కు గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.

కాగా.. డోనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు ప్లాన్ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి చూస్తే ఇదే అర్థం అవుతోంది. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి ముందుగానే అక్కడకు చేరుకున్నాడు. అక్కడే దగ్గరలో ఉన్న ఇంటిపైకి నిచ్చెన ఉంది. దానిపైకి ఎక్కిన ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. ట్రంప్‌ వచ్చే సమయానికి పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. గన్‌మెన్‌ పొజిషన్ చూసుకుని కాల్పులు జరిపాడు. ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి సుమారు 20 ఏళ్లు ఉంటాడనీ.. స్థానికుడే అని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు నిందితుడి పేరును వెల్లడించలేదు. ఏఆర్‌ శ్రేణి సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఆయుధాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

ట్రంప్‌పై దుండుగులు కాల్పులు జరిపిన వెంటనే సీక్రెట్ సర్వీస్‌ సిబ్బంది స్నిప్పర్‌ స్పందించి ఎదురు దాడి చేశారు. అయితే.. దుండగుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను హత్యాయత్నంగా నమోదు చేసిన ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు చేస్తోంది. ట్రంప్‌పై దాడి జరగొచ్చనే అనుమానాలను గతంలోనే వ్యక్తం చేశారు. అందుకే అప్పటి నుంచి ట్రంప్‌కు సెక్యూరిటీని కూడా పెంచారు.

Next Story