షాకింగ్ ఘటన.. కర్ణాటకలోని లాడ్జిలో జంటపై దాడి

కర్ణాటకలో దారుణం వెలుగులోకి వచ్చింది. లాడ్జి గదిలో దిగిన ఓ జంటపై కొందరు దారుణంగా దాడి చేశారు.

By Srikanth Gundamalla
Published on : 11 Jan 2024 3:42 PM IST

attack,  karnataka, lodge, viral video,

షాకింగ్ ఘటన.. కర్ణాటకలోని లాడ్జిలో జంటపై దాడి

కర్ణాటకలో దారుణం వెలుగులోకి వచ్చింది. లాడ్జి గదిలో దిగిన ఓ జంటపై కొందరు దారుణంగా దాడి చేశారు. మతాంతర జంట ఒకే గదిలో ఉండటం కారణంగా చూపి తీవ్రంగా కొట్టారు. జంటపై దాడి చేస్తూ వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సంఘటన జనవరి 7వ తేదీన హవేరి జిల్లాలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హనగల్‌ తాలూకాలోని లాడ్జిలో మతాంతర జంట దిగిందనే సమాచారం తెలుసుకున్నారు ఆరుగురు వ్యక్తులు. ఆ తర్వాత వారు గదిలో ఉండగానే చొచ్చుకుని వెళ్లారు. నేరుగా యువతి వద్దకు పరగుతు తీశారు. గదిలోకి దుండగులు ప్రవేశించడంతో గమనించిన సదురు మహిళ తన ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేసింది. అయితే.. దుండగులు యువతిపై దాడి చేశారు. ఒక వ్యక్తి గట్టిగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. గదిలో యువతితో పాటు ఉన్న వ్యక్తిపై కూడా దుండుగులు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. దాంతో.. సుదురు వ్యక్తి భయంతో లాడ్జి బయటకు పరుగులు తీశాడు. ఆ తర్వాత యువతి బురఖాతో ముఖాన్ని కప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ.. దాడి చేసిన వ్యక్తులు హిజాబ్‌ను తొలగించి వీడియో తీశారు. ఇద్దరిపై దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చివరకు సోషల్‌ మీడియాలో వీడియో ప్రత్యక్షం కావడంతో వైరల్‌ అయ్యింది.

ఇక దుండగులదాడిలో గాయాలపాలైన జంట హనగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వీడియో ఆధారంగా ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందినవారుగా గుర్తించారు. మిగిలిన ఆరుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. అసలు దాడికి ఎందుకు పాల్పడ్డారు? దీని వెనుక అసలు కారణాలేంటి.. యువతీ, యువకుల మతాలు వేరు కావడమే కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story