షాకింగ్: షోరూమ్‌లోకి చొరబడి, తలపై గన్‌ పెట్టి రూ.25 కోట్ల విలువైన గోల్డ్ చోరీ

ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్‌లో ఏకంగా రూ.25 కోట్ల విలువైన సొత్తును దొంగల ముఠా ఎత్తుకెళ్లిపోయారు.

By Knakam Karthik
Published on : 10 March 2025 9:02 PM IST

National News, Bihar, Tanishq Showroom, Armed Robbers, Loot Jewellery

షాకింగ్: షోరూమ్‌లోకి చొరబడి, తలపై గన్‌ పెట్టి రూ.25 కోట్ల విలువైన గోల్డ్ చోరీ

బిహార్‌లో సినీ ఫక్కీని మించిన బంగారం చోరీ జరిగింది. ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్‌లో ఏకంగా రూ.25 కోట్ల విలువైన సొత్తును దొంగల ముఠా ఎత్తుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని అర్రాలో గల తనిష్క్ షోరూంలోకి చొరబడిన సాయుధ దొంగలు కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. తుపాకీతో సిబ్బందిపై దాడి చేసి షట్టర్ కు తాళం వేసి 30 నిమిషాల పాటు ఉద్యోగులను బందీలుగా ఉంచి విలువైన నగలతో పరారయ్యారు. షోరూంలోని సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలి చౌక్ బ్రాంచ్ లో ఈ చోరీ జరిగింది.

ఆరా ప్రాంతంలో ఉన్న తనిష్క్ గోల్డ్ షోరూమ్‌ను దాని యజమాని.. ఎప్పటిలాగే సోమవారం కూడా ఉదయం 10 గంటలకు తెరిచారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే 9 మంది గుర్తు తెలియని వ్యక్తులు.. షోరూంలోకి చొరబడ్డారు. వారు హెల్మెట్, మంకీ క్యాప్‌లు ధరించి.. చేతుల్లో తుపాకులు పట్టుకుని.. పక్కా ప్లాన్ ప్రకారం.. ఆ గోల్డ్ షోరూంలోకి దూరారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బంది, కస్టమర్లపై తుపాకీలు గురిపెట్టి భయపెట్టారు. దీంతో వారంతా బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురయ్యారు. ఈ చోరీలో దాదాపు రూ.25 కోట్ల విలువైన బంగారం, ఇతర విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు సంబంధిత షోరూం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Next Story