హార్ట్ ఎటాక్ ఇప్పుడు ఈ పదం వింటే చిన్నా పెద్దా తేడా లేకుండా వెన్నులో వణుకు పుడుతోంది. ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు రావడం ఆందోళనలకు గురిచేస్తోంది. చిన్న పిల్లలు సైతం గుండెపోటు బారిన పడి తమ తనువును చాలిస్తున్నారు. తాజాగా అలాంటి విషాద ఘటన ఒకటి జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. స్కూల్‌లోని క్లాస్ రూమ్‌లోకి వెళ్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం జరిగింది.ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇంటర్ నెట్‌లో వైరల్ అవుతోంది.
శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారి తన క్లాస్ రూమ్‌లోకి వెళ్తున్న దృశ్యాలు మనం సీసీటీవీలో చూడవచ్చు. లాబీలో ఉన్న కుర్చీలో కూర్చుంది. ఒక్కసారిగా క్షణాల్లోనే అదే చైర్‌లో కుప్పకూలిపోయింది ఈ విషయాన్ని అక్కడున్న విద్యార్థులు, టీచర్లు గమనించారు. కాసేపటి తర్వాత విద్యార్థిని కుప్పకూలిపోవడాన్ని గమనించిన ఓ టీచర్ సీపీఆర్ చేసేందుకు ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే హార్ట్ ఎటాక్‌తో చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.