తెలుగు పాటకు చిందేసిన ఆఫ్రికా పిల్లలు

African kids dance to Telugu song, desi netizens impressed. సోషల్ మీడియా.. ఎప్పుడు ఏ భాషకు సంబంధించిన పాట వైరల్ అవుతుందో చెప్పలేము.

By Medi Samrat  Published on  28 Sept 2022 5:45 PM IST
తెలుగు పాటకు చిందేసిన ఆఫ్రికా పిల్లలు

సోషల్ మీడియా.. ఎప్పుడు ఏ భాషకు సంబంధించిన పాట వైరల్ అవుతుందో చెప్పలేము. ప్రస్తుతం రాను రానంటూనే చిన్నదో సాంగ్ బాగా పాపులర్ అయింది. ఒకప్పుడు జయం సినిమాలోని సాంగ్ ను ఇటీవల నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ పాటతో పెద్ద ఎత్తున రీల్స్, వీడియోలను చూస్తూ వస్తున్నాం. తాజాగా మన తెలుగు పాటకు ఆఫ్రికాకు చెందిన పిల్లలు డ్యాన్స్ చేయడం విశేషం.

ఆఫ్రికన్ ప్రాంతంలోని మసాకా కిడ్స్ ఆఫ్రికానా అనే ఎన్జీవో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ట్రెండింగ్ పాటకు ముగ్గురు పిల్లలు డ్యాన్స్ చేసిన రీల్‌ను అప్‌లోడ్ చేసింది. ఇతర పిల్లలు కూడా ఈ పాటలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ క్లిప్‌కు 9.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను ఇష్టపడిన అనేక మంది భారతీయులు, "లవ్ ఫ్రమ్ ఇండియా" అని రాశారు. ఈ నిరుపేద పిల్లలు రీల్స్ కారణంగా.. సోషల్ మీడియా స్టార్‌లుగా మారారు. అద్భుతమైన డ్యాన్స్ తో అందరినీ అలరిస్తూ ఉంటారు. గతంలో పలు పాటలకు వీరు డ్యాన్స్ అదరగొట్టారు.


Next Story