Video: కాటేసిన పాముని పట్టుకుని.. ఆస్పత్రికి వచ్చిన మహిళ

ములుగు జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ దైర్య సాహసాలు చూసి వైద్యులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.

By అంజి  Published on  16 April 2024 8:10 PM IST
hospital, snake, Mulugu district, Viralnews, Venkatapuram

Video: కాటేసిన పాముని పట్టుకుని.. ఆస్పత్రికి వచ్చిన మహిళ

ములుగు జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ దైర్య సాహసాలు చూసి వైద్యులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతూ ఉండటంతో నెటిజన్లు సైతం ఆమె ధైర్యాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకు ఆ మహిళ ఏం చేసిందబ్బా అని ఆలోచిస్తున్నారా.. సర్వసాధారణంగా పాములంటే ప్రతి ఒక్కరికి భయంగా ఉంటుంది. పాము కాటేస్తే సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు కూడా పోతాయి. అయితే ఓ మహిళ మాత్రం తనను కాటు వేసిన పామును సైతం పట్టి చంపేయడమే కాకుండా ఏకంగా ఆస్పత్రికి పాముతో సహా డాక్టర్ ముందు ప్రత్యక్షమైంది.

అది చూసిన డాక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది. వెంకటాపురానికి చెందిన శాంతమ్మ అనే మహిళ రోజువారీ పనిలో భాగంగా ఉదయం కూలీ పనికి వెళ్ళింది. అక్కడ కూలీ పనులు చేస్తుండగా ఓ పాము ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఆమె కాలును కాటేసింది. దీంతో శాంతమ్మ ఆగ్రహం చెంది ఆ కాటేసిన పాముని చంపి వాటర్ బాటిల్ లో వేసుకొని హాస్పిటల్ కి వచ్చింది. ఈ పాము తనను కాటేసింది వైద్యం చేయమని డాక్టర్ని కోరింది. సదరు మహిళ ధైర్యాన్ని చూసి డాక్టర్ ఆశ్చర్యచేతలయ్యాడు. ఆస్పత్రిలో ఉన్న వారందరూ ఈ మహిళ ధైర్యం చూసి అందరూ అభినందనలు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Next Story