పెళ్లి బృందంపై హోటల్‌ సిబ్బంది దాడి.. ఎందుకో తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ పెళ్లి వేడుక గొడవకు దారితీసింది. పెళ్లికి వచ్చిన వారిపై హోటల్‌ సిబ్బంది దాడి చేశారు.

By అంజి  Published on  28 Feb 2023 4:35 AM GMT
Ghaziabad, Uttar Pradesh,  DJ party, Mehendi function

హోటల్ సిబ్బంది, బౌన్సర్లు మెహందీ ఈవెంట్‌కు హాజరైన వ్యక్తులను కొట్టారు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ పెళ్లి వేడుక గొడవకు దారితీసింది. పెళ్లికి వచ్చిన వారిపై హోటల్‌ సిబ్బంది దాడి చేశారు. దీంతో పెళ్లి తరఫు వారు కూడా ఎదురు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఘజియాబాద్‌లో హోటల్ సిబ్బంది, బౌన్సర్లు పెళ్లి కుటుంబ సభ్యులను కొట్టిన వీడియో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. గోవిందపురంలోని హౌసింగ్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న కుటుంబం మెహందీ ఫంక్షన్ కోసం హోటల్‌ను బుక్ చేసుకున్నారు.

అర్థరాత్రి వరకు డీజే ప్లే చేయాలని వారు పట్టుబట్టడంతో హోటల్‌ యాజమాన్యం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే హోటల్ సిబ్బంది, బౌన్సర్లు కార్యక్రమానికి హాజరైన వ్యక్తులను కొట్టారు. వైరల్ వీడియోలో.. పూర్తి స్థాయి ఘర్షణలో చాలా మందిని బెల్టులు, కర్రలతో కొట్టడం కనిపించింది. ఈ కొట్లాటలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి సహా కనీసం నలుగురికి గాయాలయ్యాయి. హోటల్ సిబ్బంది, అతిథులు పరస్పరం ఘర్షణ పడడంతో సంతోషకరమైన సందర్భం మొత్తం గొడవగా మారింది. వీడియోలో.. వ్యక్తులు తన్నడం, కొట్టడం, కర్రలు, రాడ్‌లను ప్రయోగించడం చూడవచ్చు. అయితే మహిళలు బ్యాక్‌గ్రౌండ్‌లో కేకలు వేస్తున్నట్లు వినవచ్చు. హోటల్‌లో అర్థరాత్రి డీజే మ్యూజిక్ ప్లే చేయడంపై వివాదం మొదలైంది.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేసిన ఈ వీడియోలో.. ఘర్షణలో పాల్గొన్న 15 నుండి 20 మందిపై కేసు నమోదు చేయడానికి దారితీసింది. వైరల్ క్లిప్‌లో ఉన్న వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నారు. తదుపరి చర్యలు తీసుకుంటారు. ఘజియాబాద్ రూరల్ డిసిపి రవి కుమార్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 2 గంటలకు మెహందీ వేడుకకు హాజరైనవారు డిజేను నైట్‌ వరకు కొనసాగించాలని పట్టుబట్టారు. ఈ డిమాండ్‌పై హోటల్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ''వాగ్వాదం సమయంలో ఘర్షణ చెలరేగింది. 15-20 మందిపై కేసు నమోదు చేయబడింది. ఈ సంఘటనలో పాల్గొన్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు'' అని చెప్పారు.

Next Story