Video: కాళ్లతో తొక్కినా..ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న టూరిస్టు

కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో ఏనుగు బీభత్సం సృష్టించింది.

By Knakam Karthik
Published on : 11 Aug 2025 12:15 PM IST

Viral Video, Karnataka, wild elephant attack, Bandipur

Video: కాళ్లతో తొక్కినా..ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న టూరిస్టు

కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో ఏనుగు బీభత్సం సృష్టించింది. కేరళకు చెందిన ఒక పర్యాటకుడు అడవి ఏనుగు దాడి నుండి అద్భుతంగా బయటపడ్డాడు. ఆ ఏనుగు అతనిపై దాడి చేసి, నేలపైకి నెట్టి, ఏనుగు పాదాల కింద చిక్కుకుంది, కానీ జంతువు వెనక్కి తగ్గిన తర్వాత గాయాలతో తప్పించుకోగలిగింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేరళకు చెందిన ఓ పర్యాటకుడు బందీపూర్ అభయారణ్యం గుండా వెళ్లే రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు, ఇతర పర్యాటకులు కూడా ఉన్నారు. ఇంతలో, రోడ్డు పక్కన ఉన్న ఓ ఏనుగు అకస్మాత్తుగా అతనిపైకి దూసుకొచ్చింది. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అతను పరుగులు తీశాడు. కాసేపు వెంబడించిన ఏనుగు, అతను కింద పడిపోవడంతో సమీపించి తన కాలితో బలంగా తొక్కింది. చుట్టూ ఉన్నవారు భయంతో కేకలు వేశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఏనుగు అక్కడి నుంచి వెనక్కి తగ్గడంతో అతను స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Next Story