Fact Check : పోలీసులు మహిళ మీద దాడి చేసిన ఘటన ఫ్రాన్స్ లో చోటు చేసుకుందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Nov 2020 8:18 AM ISTపోలీసు స్టేషన్ లో ఓ అధికారి మహిళ మీద దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముస్లిం యువతిని ఫ్రెంచ్ పోలీసులు హింసలకు గురి చేశారంటూ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఆమెతో స్కార్ఫ్ ను తీసేయించడానికి ఈ పని చేశారని పోస్టుల ద్వారా చెబుతూ ఉన్నారు.
Please share it so important, French police arrest young Muslim girl and by force this Nazi police forcefully trying to take her scarf off from young lady’s head, after that so horrible western democracy. pic.twitter.com/k5ElSlTWhK
— Abdul Hameed Jamali (@Dr_A_H_Jamali) November 4, 2020
"Please share it so important, French police arrest young Muslim girl and by force this Nazi police forcefully trying to take her scarf off from young lady’s head, after that so horrible western democracy." అంటూ షేర్ చేస్తూ ఉన్నారు. ఫ్రెంచ్ పోలీసులు చేసిన దాడిలో ఆమె తలకు చాలా గట్టిగా దెబ్బ తగిలిందంటూ చెప్పుకొచ్చారు.
ఈ వీడియోను ఫేస్ బుక్, ట్విట్టర్ లో షేర్లు చేస్తూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ:
ఫ్రెంచ్ పోలీసులు మహిళ మీద దాడి చేసిన వీడియో అంటూ వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ ఘటనపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Canadian Broadcasting Corporation (CBC) వీడియోను అప్లోడ్ చేయడం గమనించవచ్చు. రిపోర్టుల ప్రకారం ఈ ఘటన కెనడాలోని కల్గరీ(calgary)లో చోటు చేసుకుంది. ఆ పోలీసు అధికారిని కానిస్టేబుల్ అలెక్స్ డున్ గా గుర్తించారు. కల్గరీ పోలీసు స్టేషన్ లో అతడు అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు.
Global News, Revolt, Newsweek లో కూడా ఈ ఘటనపై కథనాలు వచ్చాయి. 2017 సంవత్సరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళకు అప్పటికే చేతులకు బేడీలు వేసి ఉంచి, గోడ దగ్గర నిలబెట్టారు. అలెక్స్ ఆమె స్కార్ఫ్ ను తల మీద నుండి తీయాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత వెంటనే ఆమె ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడైన అలెక్స్ ఆమెను ఒక్కసారిగా కిందకు పడేశాడు. దీంతో ఆమె తల బలంగా కింద పడింది. 2017 లో అలెక్స్ ఈ ఘటనలో అరెస్ట్ అయ్యాడు. అక్టోబర్ 26, 2020న విడుదలయ్యాడు.
2017లో కెనెడాలో చోటు చేసుకున్న ఘటనను.. ఇప్పుడు ఫ్రాన్స్ లో చోటు చేసుకుందంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఘటనకు ఫ్రాన్స్ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.