Fact Check : స్విమ్మింగ్ పూల్ లోకి ఎత్తు నుంచి దూకుతున్న జిరాఫీలు ఆస్ట్రేలియాలోనివి కావు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 July 2020 6:39 AM GMT
Fact Check : స్విమ్మింగ్ పూల్ లోకి ఎత్తు నుంచి దూకుతున్న జిరాఫీలు ఆస్ట్రేలియాలోనివి కావు

హైదరాబాద్: కొన్ని జిరాఫీలు కొంత ఎత్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఆ వీడియా ఆస్ట్రేలియాలో చిత్రించినదిగా దానిని షేర్ చేసినవారు చెబుతున్నారు.

ఆ వీడియో వివరాలలో భాగంగా కొందరు ఈ కింది వివరణ ఇస్తున్నారు.

"ప్రపంచంలో అతి ఖరీదైన షోలలో ఇది ఒకటి. దీనిని ఆస్ట్రేలియాలో ప్రదర్శించారు. చాలా ఖర్చుపెట్టి ఈ జీరాఫీలకు శిక్షణ ఇచ్చారు. ఒక జిరాఫీ తనకు సహజంగా నీటిపట్ల ఉండే భయాన్ని అధిగమించటానికి కనీసం రెండేళ్ల శిక్షణ అవసరం. అదే నీటిలో దూకటానికి 3, 4 ఏళ్ల శిక్షణ కావాలి. ఈ అద్భుతమైన షో చూసి మీరూ ఆనందించండి."

నిజ నిర్ధారణ

నిజానికి ఈ వీడియా చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇప్పుడు ప్రచారంలోకి తేవటానికి యూజర్లు మళ్లీ ప్రయత్నించారు. జిరాఫీలు ఎత్తు నుంచి నీళ్ళలో దూకటం ఒక అసాధారణమైన చర్య. కాబట్టి మేము గూగుల్ శోధనను ‘giraffes high diving video’ అనే కీవర్డ్స్ తో మొదలుపెట్టాం. అప్పుడు కొన్ని వెబ్ పేజీలతో పాటు ఇదే వీడియోకు నకలు అయిన వీడియోలు యూట్యూబ్ వంటి వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ లు మరికొన్నింటిపై కనిపించాయి.

ఈ వెబ్ పేజీలు https://www.metalocus.es/en/news/5m80-or-swimmers-giraffes మరియు https://en.unifrance.org/movie/37362/5-metres-80 ప్రకారం ఈ వీడియో నిజమైనది కాదని మనకు తెలుస్తుంది. ఇది Nicolas Deveaux అనే ఒక ఫ్రెంచ్ యానిమేషన్ డైరెక్టరు 2012 లో తీసిన ‘5meters 80’ అనే యానిమేషన్ వీడియో. ఇది 2013, అంతకు ముందు నుంచే ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉంది.

2013 లో డైలీమోషన్ వెబ్ సైటులో అప్ లోడ్ చేసిన పూర్తి వీడియోను కింద ఇచ్చిన లింకులో చూడవచ్చు.

https://www.dailymotion.com/video/xxyuig

Nicolas Deveaux ఒక అద్భుతమైన దర్శకుడు. ఈ వీడియోతో పాటుగా ఏనుగు ఒక ట్రాంపోలిన్ పై ఎగురుతున్న వీడియో, ఏనుగులు స్కై డైవింగ్ చేస్తున్న వీడియోలు అతనికి మంచిపేరు తెచ్చిపట్టాయి.

అతని ఇతర వర్క్స్, షో రీల్ ఇక్కడ చూడ వచ్చు. https://vimeo.com/nicolasdeveaux or

http://www.cube-creative.com/directors/nicolas-deveaux/

కాబట్టి, స్విమ్మింగ్ పూల్ లోకి ఎత్తు నుంచి దూకుతున్న జీరాఫీలు ఆస్ట్రేలియాకు చెందినవనే క్లెయిమ్ అసత్యం. నిజానికి అది పూర్తిగా యానిమేషన్ వీడియో.

  • ఎన్. ఎన్. ధర్మసేన

Next Story