Fact Check : అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకుల నుండి వసూలు చేసిన డబ్బును.. రోడ్డు మీద ప్రదర్శనకు ఉంచారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2020 1:51 PM IST
Fact Check : అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకుల నుండి వసూలు చేసిన డబ్బును.. రోడ్డు మీద ప్రదర్శనకు ఉంచారా..?

కట్టలు.. కట్టలుగా పేర్చిన బ్రెజిలియన్ కరెన్సీని రోడ్డు మధ్యలో ప్రదర్శనకు ఉంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకుల నుండి వసూలు చేసిన డబ్బు ఇదని.. బ్రెజిల్ లో ఎందరో అవినీతి పరులు ప్రజల డబ్బును కొట్టేశారని.. దాన్ని తిరిగి వసూలు చేసి రోడ్డు మీద ప్రజలందరికీ చూపించారని పోస్టులు పెడుతూ ఉన్నారు.

“This is not a building. These are the 4 billion dollars that the Brazilian government has recovered from its corrupt politicians and public servants. The money is displayed in public places for public viewing. One day we hope the same happens in Pakistan.۔۔۔https://t.co/StmJJk7JlK,” అని ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇదొక బిల్డింగ్ కాదు.. ఇదంతా 4 బిలియన్ డాలర్ల డబ్బు.. బ్రెజిల్ ప్రభుత్వం అవినీతి పరులైన రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుండి వసూలు చేసింది. ప్రజలంతా చూడాలని ఇలా రోడ్డు మీద ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఏదో ఒక రోజు పాకిస్థాన్ లో కూడా ఇలాగే జరుగుతుంది అన్నది ఆ ట్వీట్ సారాంశం.

నిజ నిర్ధారణ:

వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 'Bandab' అనే పోర్చుగీసు వెబ్ సైట్ లో ఈ డబ్బులకు సంబంధించిన పోస్టును గమనించవచ్చు. ఆగష్టు 2017న “Boca Maldita dawns with R $ 4 billion stacked on the premiere day of the Lava Jato movie” అంటూ ఆర్టికల్ ను పోస్టు చేసింది. దీన్ని బట్టి ఓ సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీమియర్ కోసం ఇలా 4 బిలియన్ డాలర్ల డబ్బును ప్రదర్శనకు ఉంచారని అర్థం అవుతుంది.

లవా జాటో(ఆపరేషన్ కార్ వాష్) అనే స్కామ్ కు సంబంధించి తీసిన సినిమా ‘Federal Police – The law is for everyone’ ప్రీమియర్ సందర్భంగా ఇలా ప్రజలను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున డబ్బును వీధిలో ప్రదర్శనకు ఉంచారు. 5 మీటర్ల ఎత్తు వరకూ ఆ నాలుగు బిలియన్ డాలర్ల డబ్బును ఉంచారు. బ్రెజిల్ లో బయట పడ్డ ఆపరేషన్ లవా జాటో స్కామ్ ద్వారా.. రాజకీయ నాయకుల నుండి డబ్బులు వసూలు చేశారు. అదే సబ్జెక్టు మీద సినిమా తీశామని చెప్పుకోడానికి.. చిత్ర దర్శక నిర్మాతలు ఇలా డబ్బును ప్రదర్శనకు ఉంచారు.

న్యూస్ మీటర్ ఇందుకు సంబంధించిన వీడియోను 2017లో యుట్యూబ్ లో అప్లోడ్ చేయడాన్ని గుర్తించింది. 'ఫెడరల్ పోలీస్: ది లా ఈజ్ ఫర్ ఎవరీ వన్' అనే సినిమాకు సంబంధించింది అని తెలిపారు.

ఆ వీడియోలో బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ పెద్ద ఎత్తున డబ్బును ఓ చోట ఉంచారు. దీంతో ప్రజలు కూడా అంత డబ్బు ఒకే చోట ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇలా డబ్బును ఏర్పాటు చేయడానికి కారణం.. సినిమా ప్రమోషన్స్ లో భాగమే..!

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

Claim Review:Fact Check : అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకుల నుండి వసూలు చేసిన డబ్బును.. రోడ్డు మీద ప్రదర్శనకు ఉంచారా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story