ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చెప్పినట్లుగా కొన్ని వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. '2022 సంవత్సరంలో సమాజ్ వాదీ పార్టీ అధికారికం లోకి వస్తుందని.. అప్పుడు మాకు రాముడు, హనుమంతుడి అవసరం లేదు' అన్న వ్యాఖ్యలు అఖిలేష్ యాదవ్ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వస్తున్నారు.

ఎంతో మంది సోషల్ మీడియా యూజర్లు ఈ పోస్టును ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఓ ఫోటోలో అఖిలేష్ యాదవ్ ఆ వ్యాఖ్యలు చేశారన్నట్లుగా ఉండగా.. దాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు.

'నీటి కుళాయిల దొంగ రాముడు, హనుమంతుడిల అవసరం లేదని చెబుతూ వచ్చాడు.. ఇప్పుడేమో తాను విష్ణు ఆలయాన్ని కడతాను ఇటావాలో అని చెబుతున్నాడు' అంటూ పోస్టు పెట్టారు కొందరు.

A1

ఈ పోస్టును ఆ తర్వాత డిలీట్ చేయడం కూడా జరిగింది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి 'నిజం లేదు'.

న్యూస్ మీటర్ నిజా నిజాలు తెలుసుకోడానికి కీ వర్డ్ సెర్చ్ చేయగా Hindustan లో వార్తా కథనం లభించింది. 'Hindustan Summit Conference: I don’t need to latch on to Ram and Hanuman. I will hold on to work.' అంటూ ఆర్టికల్ ను ప్రచురించారు. హిందుస్థాన్ సమిట్ కాన్ఫరెన్స్ లో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ 'రాముడు, హనుమంతుడి మీద తాను రాజకీయాలను చేయనని.. తాను పని చేసే రాజకీయ నాయకుడిని' అని చెప్పుకొచ్చాడు.

A2

ఫిబ్రవరి 2020న హిందుస్థాన్ సమిట్ ఏర్పాటు చేసినప్పుడు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఆ ప్రోగ్రామ్ లో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ రాముడు, హనుమంతుడు పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేయనని.. తాను పని చేస్తూ ముందుకు వెళతానని చెప్పుకొచ్చారు. దేవుళ్ళ మీద రాజకీయాలు చేసుకుంటూ ఓట్లను పొందాలని అనుకోవడం లేదని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది.

ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన వీడియోలో అఖిలేష్ వ్యాఖ్యలు గమనించవచ్చు. 'కేజ్రీవాల్ ప్రభుత్వం హనుమంతుడి మీద ఆధారపడి ఉంది.. బీజేపీ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోంది. మరైతే మీరు కృష్ణుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొచ్చు కదా.. మీరు యదువంశీయులు కదా' అని ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు సమాధానంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ 'తాను ఇలా దేవుళ్ళను అడ్డం పెట్టుకుని ఉండనని.. తాను పని చేస్తూ ఉంటానని అన్నారు. మేము ఎక్స్ ప్రెస్ వే ను నిర్మిస్తాము' అని చెప్పుకొచ్చారు.

అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను పలు న్యూస్ వెబ్ సైట్స్ ప్రచురించాయి. అందులో ఎక్కడ కూడా తమకు రాముడు, హనుమంతుడు అవసరం లేదని వ్యాఖ్యలు చేయలేదు. కావాలనే అఖిలేష్ యాదవ్ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు.

https://www.headlinestoday.in/hn/news/uttar-pradesh-story-i-do-not-need-to-catch-ram-and-hanuman-i-will-hold-work-say-akhilesh-yadav-at-hindustan-shikhar-samagam-3041990-157411905.html

https://www.google.com/amp/s/www.zoomnews.in/amp/en/news-detail/sp-will-win-351-seats-in-2022-up-polls-says-akhilesh-yadav.html

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review :   Fact Check : రాముడు, హనుమంతుడి అవసరం లేదంటూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు చేశారా..?
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story