రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు చెందిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒకరి భుజం మీద మరొకరు చేతులు వేసుకుని, నవ్వుతూ ఉన్నారు ఆ ఫోటోలో..! ఇటీవల హత్రాస్ బాధితురాలిని పలకరించడానికి వారు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో ఇదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
https://m.facebook.com/groups/1666392106909853/permalink/2864211873794531/
'హత్రాస్ బాధితురాలిని కలవడానికి వెళ్ళినప్పుడు వారి ముఖంలో కొట్టొచ్చినట్లు బాధ కనిపిస్తోందని' సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తూ ఉన్నారు.
ఏబీవీపీ మెంబర్ అనిమా సోంకర్ కూడా ఈ ఫోటోను పోస్టు చేసి ప్రతిపక్ష పార్టీ మీద సెటైర్లు వేశారు. 'హత్రాస్ కు వెళుతున్న అపోజిషన్ నేతలు వీరే.. వీరి ముఖాలను చూస్తే మనకు అర్థం అవుతుంది ఎంత బాధతో అక్కడికి వెళ్తున్నారో' అని ట్వీట్ చేసింది.
అనిమా సోంకర్ ఆ తర్వాత ఈ ట్వీట్ ను డిలీట్ చేశారు.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ ఈ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోను ‘Zee News‘ లో డిసెంబర్ 2019 సమయంలో పోస్టు చేశారు. ‘India AHead News‘ వెబ్ సైట్ లో జులై 04, 2019 న పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో చూడొచ్చు. దీన్ని బట్టి ఈ ఫోటో ఇప్పటిది కాదని స్పష్టమవుతోంది. హత్రాస్ హత్యాచార ఘటనకు ఈ ఫోటోకు ఎటువంటి సంబంధం లేదని అర్థమవుతోంది.
ఇక సెర్చ్ రిజల్ట్స్ ద్వారా ‘UP East Youth Congress’ ఈ ఫోటోలను ట్వీట్ చేయడం గమనించవచ్చు. 27 ఏప్రిల్ 2019న ఫోటోలను పోస్టు చేశారు. బిజీ షెడ్యూల్ లో ఉన్న అన్నా చెల్లెళ్ళ మధ్య చోటు చేసుకున్న సరదా సంభాషణకు సంబంధించిన ఫోటోలు ఇవి అని ట్వీట్ చేశారు. వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ఈ ఫోటో కూడా ఒక నిదర్శనం అని అర్థమవుతోంది అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా అదే రోజున ఈ ఫోటోలను పోస్టు చేయడం గమనించవచ్చు.
‘The Indian Express‘ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మీద కథనాలు కూడా వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ బిజీగా ఉన్న సమయంలో కాన్పూర్ ఎయిర్ పోర్టులో వారు కలవడం జరిగిందని తెలిపింది. రాహుల్ గాంధీ కూడా తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో వీడియోను షేర్ చేశారు. “Was nice meeting Priyanka at Kanpur Airport!” అంటూ టైటిల్ ను పెట్టి వీడియోను అప్లోడ్ చేశారు.
https://m.facebook.com/rahulgandhi/videos/602110396936687/?locale2=en_US
అంతే కానీ ఈ ఫోటోకు హత్రాస్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ఎయిర్ పోర్టులో 2019లో తీసిన ఫోటో ఇది. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.