Fact Check : బెంగాల్ లో బీజేపీ నేత పోలీసును కొట్టాడంటూ ఫోటో వైరల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2020 12:15 PM GMT
Fact Check : బెంగాల్ లో బీజేపీ నేత పోలీసును కొట్టాడంటూ ఫోటో వైరల్..!

భారతీయ జనతా పార్టీకి చెందిన గూండాలు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పోలీసులను కొట్టారంటూ ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. సెటైరికల్ గా బీజేపీ ని విమర్శించే విధంగా ఈ ఫోటోను పోస్టు చేస్తూ ఉన్నారు.



'बंगाल में बीजेपी के गुंडे एक बुजुर्ग पुलिस वाले की सहायता करते हुए...' అంటూ ఈ ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

ఈ ఫోటోను న్యూస్ మీటర్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. Daily Mail లో ఈ ఘటన గురించి జూన్ 2017న పోస్టు చేశారు. ఆసుపత్రి లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న టీనేజీ అమ్మాయి మీద అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనను నిర్వహించారు. ఆ సమయంలో పోలీసుల మీద కూడా దాడి చేయడం జరిగింది. అప్పటికి సంబంధించిన ఫోటో ఇది..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని కాన్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. the Sun లో కూడా ఈ ఫోటోనే ఉపయోగించారు.

India TV లో కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుందని.. ఆగ్రహించిన స్థానికులు పోలీసుల మీద కూడా తిరగబడ్డారు. అల్లర్లకు పాల్పడ్డ వారి మీద పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. కొందరు పోలీసుల మీద కూడా తిరగబడ్డారు. అలా ఓ పోలీసుని కింద పడేసి.. విచక్షణా రహితంగా దాడి చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. పలు మీడియా సంస్థలు ఈ ఘటన మీద కథనాలను ప్రచురించారు.

గతంలో కూడా ఈ ఘటన పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నదంటూ వైరల్ చేయడం జరిగింది. అందులో ఎటువంటి నిజం లేదని నిజనిర్ధారణ చేయడం కూడా జరిగింది. మరోసారి బెంగాల్ లో ఈ ఘటన చోటు చేసుకుందంటూ ఆ ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు.

ఈ వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. బెంగాల్ లో చోటు చేసుకుందంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో 2017 సంవత్సరంలో చోటు చేసుకుంది.

Claim Review:Fact Check : బెంగాల్ లో బీజేపీ నేత పోలీసును కొట్టాడంటూ ఫోటో వైరల్..!
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story