సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని అతి దగ్గరగా వచ్చి కాల్చిన వీడియో అది. జర్నలిస్టు జమాల్ ఖస్సోగిని చంపిన సౌదీ అరేబియా కల్నల్ మీద తూటాల వర్షం కురిపించిన వీడియో ఇదని చెబుతూ ఉన్నారు.

"Today, shootout of colonel from Saudi Arabia who was involved in the killing of journalist Jamal Khashoggi in #Saudi Consulate in #Turkey (sic),” అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

ఓ వ్యక్తి రెస్టారెంట్ లో కూర్చుని ఉండగా.. టోపీలు పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి టేబుల్ మీద వ్యక్తి మీద విచక్షణారహితంగా చాలా దగ్గర నుండి కాల్చేశారు. అక్కడే అతడు కుప్పకూలిపోయాడు.

నిజ నిర్ధారణ:

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ‘El Universo’ కు చెందిన ట్విట్టర్ అకౌంట్ లింక్ కనిపించింది. సౌత్ అమెరికా లోని ఈక్వెడార్ కు చెందిన మీడియా సంస్థల్లో ఇది కూడా ఒకటి. "గువాయాకిల్ లో ఓ సింగర్ ను చంపేశారు" అని ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు.

‘El Universo‘ లో ఈ ఘటనకు సంబంధించిన కథనాన్ని రాశారు. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోందని.. లినో అనే వ్యక్తి మీద ఇద్దరు తూటాల వర్షం కురిపించారని ఆ కథనంలో చెప్పుకొచ్చారు. మొత్తం 15 రౌండ్ల కాల్పులు అతడి మీద జరిగినట్లు తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో కాల్పులు జరపబడ్డ వ్యక్తిని 'జార్జ్ ఫెర్నాండో లీనో మకాస్' గా గుర్తించారు. అతడు ఒకప్పుడు పోలీసు అధికారిగా పని చేసాడు. ఆ తర్వాత సింగర్ గా మారాడు. శాంటియాగో డి గువాయాకిల్, ఈక్వెడార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీ ఫుడ్ రెస్టారెంట్ లో లీనో కూర్చుని ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని మీడియా సంస్థలు వెల్లడించాయి.

“Jorge Fernando Lino Macas, a former policeman and singer, nicknamed 'Vanilla’, was killed with at least 15 rounds on January 2, 2020.” అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ‘Revista Vistazo’ న్యూస్ వెబ్సైట్ కూడా దీనిపై కథనాలను రాసుకుని వచ్చింది. జనవరి 2, 2020న ఈ ఘటన చోటు చేసుకోగా.. 15 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ధృవీకరించారు.

ఈక్వెడార్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సౌదీ కల్నల్ కు లింక్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review :   Fact Check : ఆ వీడియోలో సౌదీ కల్నల్ ను చంపేసినట్లుగా రికార్డు అయిందా..?
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story