Fact Check : ఖిలాషాపూర్ కోట గోడ కూలుతున్న వీడియోలను.. గోల్కొండ కోటకు సంబంధించిన వీడియో అంటూ ప్రచారం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2020 6:51 AM GMT
Fact Check : ఖిలాషాపూర్ కోట గోడ కూలుతున్న వీడియోలను.. గోల్కొండ కోటకు సంబంధించిన వీడియో అంటూ ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజుల కిందట భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే..! చాలా ప్రాంతాలు వరద గుప్పిట నిలిచాయి. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో నీరు నిలిచే ఉంది. హైదరాబాద్ నగరాన్ని కూడా భారీ వర్షం ఒక్క కుదుపు కుదిపేసింది. వర్షాలకు, వరదలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గోల్కొండ కోట గోడ కూడా కూలిపోయింది. అయితే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ పురాతన గోడ కుప్పకూలుతూ ఉండగా వీడియోను తీశారు. ఆ వీడియోలో ఉన్నది గోల్కొండ కోట గోడ అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్లు చేస్తూ ఉన్నారు.

ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సప్ లో వీడియో వైరల్ అవుతోంది.

నిజమెంత:

వైరల్ అవుతున్న వీడియో గోల్కొండ కోటకు సంబంధించినది కాదు.

భారీ వర్షాలకు అక్టోబర్ 16న గోల్కొండ కోటలోని గోడ కుప్పకూలింది. కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయం ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోయింది. కొవిడ్‌ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులకు పురావస్తుశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. అయితే ప్రహరీ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినా వారు పట్టించుకోలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాని ఆ గోడ కుప్పకూలిందని అధికారులు చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది ఖిలాషాపూర్ కోట గోడ. సర్దార్ సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలో కట్టించారు. హైదరాబాద్ నగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది.

30 అడుగుల ఎత్తైన 17వ శతాబ్దానికి చెందిన కోట గోడ కూలిపోయిందని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఖిలాషాపూర్ కోటకు ఈ దుస్థితి పట్టడానికి కారణం పాలకులే..! ఎవరూ ఈ కోటను పట్టించుకోకపోవడంతో దయనీయమైన స్థితికి చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందా అన్న స్థితికి ఖిలాషాపూర్ కోట తయారైంది.

G1

G2

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో నిర్మించిన కోట గురువారం నేల మట్టమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో కోటలోని ఒకవైపు భాగం కూలిపోయింది. కోట గోడ మొత్తం కింద పడగా మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భారీ శబ్ధం రాగా, గ్రామస్తులు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కోట పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఇటీవలే రెవెన్యూ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ఖిలాషాపూర్‌ కోటను 17 మే 2017న చారిత్రక ప్రాంతంగా గుర్తించారు. టూరిజం స్పాట్‌గా ఎంపిక చేయడంతో పాటు కోట అభివృద్ధి కోసం రూ.4.50 కోట్ల నిధులను విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితమే నిధులు విడుదలైనా పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఖిలాషాపూర్‌లో శత్రు దుర్బేధ్యంగా పూర్తిగా రాతితో ఈ కోటను నిర్మించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ 20 అడుగుల ఎత్తులో రాతికోటను నిర్మించారు. నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. కోట లోపల సొరంగ మార్గాలు సైతం ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. మొఘల్‌ పాలకులపై తిరుగుబాటును ప్రకటించిన పాపన్న.. తొలికోటను ఖిలాషాపూర్‌లోనే నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు.

గోల్కొండ కోట కూలడంపై న్యూస్ మీటర్ కూడా కథనాలను అందించింది. భారీ వర్షాలకు గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయం ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోయింది. కొవిడ్‌ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. పది నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులకు పురావస్తుశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. అయితే, ప్రహరీ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాని ఆ గోడ కుప్పకూలిందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్కియాలజీ సర్వే అధికారులు గోల్కొండ కోటను పరిశీలించారు.

వైరల్ అవుతున్న వీడియోలకు, గోల్కొండ కోట గోడకు చెందిన వీడియో అంటూ చెబుతున్న కథనాలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియోలో కుప్పకూలినది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో నిర్మించిన కోట భాగం. గోల్కొండ కోట గోడ కాదు.

Claim Review:Fact Check : ఖిలాషాపూర్ కోట గోడ కూలుతున్న వీడియోలను.. గోల్కొండ కోటకు సంబంధించిన వీడియో అంటూ ప్రచారం
Claim Reviewed By:Satyapriya
Claim Fact Check:false
Next Story