Fact Check : అమెరికాలో హల్దీరామ్స్ ఫుడ్ ప్రోడక్ట్స్ ను బ్యాన్ చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2020 11:14 AM GMT
Fact Check : అమెరికాలో హల్దీరామ్స్ ఫుడ్ ప్రోడక్ట్స్ ను బ్యాన్ చేశారా..?

భారతదేశంలో హల్దీరామ్స్ కంపెనీ తయారు చేసే తినుబండారాలకు మంచి పేరు ఉంది. ఎన్నో రకాల భారతీయ వంటలను ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. సంప్రదాయ వంటలు, చిప్స్, మురుకులు, మిక్చర్లు అలాంటివి తయారుచేస్తూనే ఉంది. ప్రజలు కూడా ఎంతగానో ఇష్టపడి తింటూ ఉన్నారు.

తాజాగా హల్దీరామ్స్ కంపెనీ గురించి సామాజిక మాధ్యమాల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతూ ఉంది. అమెరికా ఫుడ్ సేఫ్టీ అధికారులు హల్దీరామ్ స్నాక్స్ ను బ్యాన్ చేశారని చెబుతూ వైరల్ పోస్టు పెడుతూ ఉన్నారు. USFDA హల్దీరామ్స్ స్నాక్స్ లో పెద్ద స్థాయిలో పెస్టిసైడ్స్ ఉండడమే కాకుండా సాల్మొనెల్లా బ్యాక్టీరియాను గుర్తించిందని.. అందుకే అమెరికాలో ఈ కంపెనీ ఫుడ్స్ ను అమ్మడం నిలిపివేశారని చెబుతూ పోస్టు చేశారు.

Firstpost, Wall Street Journal సంస్థలకు సంబంధించిన ఆర్టికల్స్ ను కూడా ఈ కథనాల్లో తెలిపారు. మకరానా నుండి హల్దీరామ్స్ మార్బల్ డస్ట్ తీసుకుంటోందని. కొన్ని పదార్థాలు కరకరలాడడానికి అది వాడడమే కారణమంటూ పోస్టుల్లో రాసుకుని వచ్చారు. ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోనూ ఈ కథనాలను ప్రచారం చేస్తూ ఉన్నారు.



ఈ పోస్టుల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలుసుకోవాలంటూ న్యూస్ మీటర్ కు రిక్వెస్ట్ అందింది.

H1

నిజ నిర్ధారణ:

USFDA హల్దీరామ్స్ ఫుడ్ ప్రోడక్ట్స్ ను బ్యాన్ చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. భూజియా కరకరలాడేందుకు మార్బల్ డస్ట్ ను వినియోగిస్తూ ఉన్నారన్నది 'అబద్ధం'.

USFDA కొన్ని పదార్థాలను సీజ్ చేసిన మాట నిజమే.. ఆ తర్వాత వార్నింగ్ లెటర్ ను 2017 లో ఇవ్వగా.. 2018లో దాన్ని అప్డేట్ చేసింది. ఆ తర్వాత ఎటువంటి అప్డేట్స్ రాలేదు.

Firstpost, Wall Street journal సంస్థలు పోస్టు చేసింది 2015 లో చోటుచేసుకున్న ఘటన గురించి. NDTV food లో 2017లో ప్రచురించిన కథనం ప్రకారం USFDA కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాల హల్దీరామ్ స్నాక్స్ ను అనుమతి ఇవ్వడం లేదు. కొన్నిటిని మాత్రమే వారి దేశాల్లో అమ్మడానికి అనుమతిని ఇస్తోంది. ఇది 2017లో చోటుచేసుకున్న ఘటన..!

ఈ మధ్యనే అమెరికాలో అమెజాన్ సంస్థ హల్దీరామ్స్ ప్రోడక్ట్స్ ను ఆన్ లైన్ లో అమ్మడం మొదలు పెట్టింది. ఎకనామిక్ టైమ్స్ నవంబర్ 2019న USFDA అప్రూవల్ హల్దీరామ్స్ కు వచ్చిందని కథనాన్ని ప్రచురించింది. అమెజాన్ సంస్థ ద్వారా అమెరికాలో ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ ను అమ్మడానికి వీలవుతుందని తెలిపింది.

'ది ఈట్ రైట్ ఇండియా మూమెంట్' లో భాగంగా పలు కంపెనీలు తమ తిండి పదార్థాలలో ఎక్కువగా ఉన్న షుగర్, సాల్ట్, ఫాట్ కంటెంట్ ను తగ్గించాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఈఓ పవన్ అగర్వాల్ తెలిపారు. చాలా సంస్థలు వాలంటరీగా ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. హల్దీరామ్స్ ప్రోడక్ట్స్ మీద వచ్చిన వదంతులను కూడా పవన్ అగర్వాల్ మే 2020న ఖండించారు. The Tribune లో ఈ కథనం వచ్చింది. మార్బల్ డస్ట్ ను వాడుతూ ఉండడం అన్న వార్తను ఖండించడమే కాకుండా.. అలాంటివి మార్కెట్ లోకి కూడా రావని తెలిపారు.

USFDA భారత్ కు చెందిన కంపెనీలు తయారు చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ ను బ్యాన్ చేయలేదని తెలిపారు. హల్దీరామ్స్ మాత్రమే కాదు పలు భుజియా కంపెనీలు తగిన జాగ్రత్తలు తీసుకుని సంప్రదాయ పద్దతిలో కరకరలాడేలా తయారుచేస్తాయని అన్నారు.

USFDA హల్దీరామ్స్ ను బ్యాన్ చేసిన వైరల్ మెసేజీ మూడు సంవత్సరాల కిందటి. అది కూడా అప్పట్లో కొన్ని ప్రోడక్ట్స్ ను మాత్రమే అమెరికాలో బ్యాన్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో అమెజాన్ సంస్థ ద్వారా హల్దీరామ్స్ తినుబండారాలను అమ్ముతూ ఉన్నారు. కాబట్టి వైరల్ అవుతున్న మెసేజీ 'అబద్ధం'.

Next Story