Fact Check : రాఫెల్ యుద్ధ విమానం అంబాలా ఎయిర్ బేస్ వద్ద కూలిపోయిందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Sep 2020 2:08 PM GMTభారత్ కు చెందిన రాఫెల్ యుద్ధ విమానం అంబాలా విమానాశ్రయం వద్ద కూలిపోయిందని.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించిందని ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన ఓ ఎడిట్ చేసిన పోస్టును కూడా ట్వీట్ కు అనుసంధానంగా పోస్టు చేశాడు.
“Very shocked news! During exercise, Rafale has crashed near Ambala Air force Station due to technical fault and a pilot martyred,” అని అందులో ఉంది. 'చాలా షాకింగ్ న్యూస్.. రాఫెల్ యుద్ధ విమానాలు పరిశీలిస్తున్న సమయంలో అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టెక్నీకల్ ఫాల్ట్ కారణంగా జరిగిన ప్రమాదంలో పైలట్ మరణించాడు' అని అందులో ఉంది.
నిజ నిర్ధారణ:
ఈ పోస్టు 'పచ్చి అబద్ధం'.
అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద రాఫెల్ యుద్ధ విమానానికి ప్రమాదం చోటుచేసుకుంది అంటూ ఎటువంటి వార్తా రాలేదు. న్యూస్ మీటర్ కూడా అలాంటి వార్త ఏ మీడియా సంస్థలో కూడా రాలేదని తెలిపింది.
ట్వీట్ చేసిన పోస్టును కూడా ఎడిట్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అధికారిక ఖాతాలో అలాంటి ఎటువంటి పోస్టు కూడా లేదు.
వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న ట్వీట్ లో సెప్టెంబర్ 4, 2020 11.33 pm సమయంలో ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అధికారిక ఖాతాలో ఆ సమయంలో ఎటువంటి పోస్టు కూడా కనిపించలేదు. ఎయిర్ ఫోర్స్ ప్రెసిడెంట్ ఏసిఎం ఆర్.కె.ఎస్.బదోరియా కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్ ను సెప్టెంబర్ 03, 2020న సందర్శించారు. అందుకు సంబంధించిన పోస్టు ను అప్లోడ్ చేశారు.
वायु सेना अध्यक्ष एसीएम आरकेएस भदौरिया ने 03सितंबर20 को कॉलेज ऑफ एयर वारफेयर (सीएडब्ल्यू) का दौरा किया। सिकंदराबाद में स्थित इस संस्था की स्थापना सन् 1959 में हुई थी। यह एक उच्च शिक्षा संस्थान है, जो तीनों सेनाओं के अधिकारियों के लिए एयरवारफेयर पर आधारित पाठ्यक्रम संचालित करता है pic.twitter.com/JIOXVqUBDL
— Indian Air Force (@IAF_MCC) September 4, 2020
ఆ తర్వాత ఐదో తేదీ కొన్ని పోస్టులను అధికారిక ఖాతాలో పోస్టు చేశారు. సెప్టెంబర్ 5, ఉదయం 8:07 సమయంలో అప్లికేషన్స్ కు సంబంధించిన పోస్టులు చేశారు.
Join #IAF: Indian Air Force invites online applications for pre-registration from unmarried male citizens (Indian/Nepalese) from the state of Gujarat, UT of Daman & Diu, and UT of Dadar & Nagar Haveli to appear in recruitment rally to join as an Airman in Group Y Trades. pic.twitter.com/NugsDQpWEL
— Indian Air Force (@IAF_MCC) September 5, 2020
Irmak Doya ఖాతాలో భారత్ కు వ్యతిరేకంగా గతంలో పలు తప్పుడు వార్తలు ప్రచారం చేశాడు. ఇప్పుడు కూడా అదే తరహా పోస్టులను చేస్తూ వస్తున్నారు. ఈ అకౌంట్ నుండి వచ్చిన పోస్టులను చాలా ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తప్పుడు వార్తలంటూ ధృవీకరించాయి.
అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద రాఫెల్ విమానం కూలిపోయినట్లు వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.