చాయ్‌వాలా టూ ర్యాంప్ వాక్ మోడల్.. ఒక్క ఫోటో జీవితాన్ని మార్చేసింది గురూ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Oct 2020 1:26 PM ISTఅర్షద్ ఖాన్.. ఒక్కఫొటోతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిన నీలి కళ్ల చాయ్‌వాలా. నాలుగేళ్ల క్రితం జియా అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఏకంగా అర్షద్ జీవితమే మారిపోయింది. చాయ్‌వాలా నుండి ఏకంగా మోడల్‌గా మారిపోయాడు. ఓ చిన్న దుకాణంలో టీ అమ్మిన అర్షద్.. నాలుగేళ్లు గిర్రున తిరిగేసరికి ఓ భారీ కేఫ్‌కు యజమానిగా మారిపోయాడు.
'చాయ్‌వాలా ఆఫ్ పాకిస్తాన్'గా పాపులర్ అయిన అర్షద్.. ఈ నాలుగేళ్లల్లో డబ్బు కూడా సంపాదించాడు. ఇప్పుడు సొంతంగా ఇస్లామాబాద్‌లో ఓ అధునాతన కేఫ్‌ను ప్రారంభించాడు. 'కేఫ్ చాయ్‌వాలా రూఫ్ టాప్' పేరుతో అర్షద్ ప్రారంభించిన ఈ కేఫ్ గురించి సోషల్‌మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.
కేఫ్ గురించి అర్షద్ మాట్లాడుతూ.. కేఫ్ పేరులోని 'చాయ్‌వాలా' అనే పదాన్ని తొలగించడం మేలని చాలా మంది సలహాలిచ్చారని.. కానీ నేను ఎవరి మాటా వినలేదని అన్నాడు. అంతేకాదు.. చాయ్‌వాలా అన్న పదమే నాకు ఈ గుర్తింపును తీసుకొచ్చిందని చెబుతున్నాడు. ఈ కేఫ్‌లో వివిధ ప్లేవర్ల కాఫీ, టీలతోపాటు.. 20 రకాల డిషెస్ లభిస్తాయని చెప్పాడు.
ఇదిలావుంటే.. అర్షద్‌ఖాన్ కేఫ్‌ను ప్రారంభించినప్పటి నుంచి నెటిజన్లు ప్రశంసలతో ముంచేస్తున్నారు. అర్షద్ నాలుగేళ్లల్లో ఎంతో వృద్దిలోకి వచ్చాడని.. లుక్స్ పరంగానే కాకుండా.. ప్రవర్తనలో కూడా ఎంతో పరిణితి సాధించాడని అంటున్నారు.