పోలీసుస్టేషన్‌కు నిప్పటించిన ఆందోళనకారులు
By సుభాష్Published on : 21 Dec 2019 8:39 PM IST

ఇటీవల పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో దేశంలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ చట్టం బిల్లకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోఈ రోజు నిరసనలు వెల్లువెత్తాయి. కార్పూరులో ఆందోళనకారులు తీవ్ర విధ్వంసం సృష్టించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసుస్టేషన్‌కు నిప్పటించారు. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అలాగే రాంపూర్‌లోనూ ఆందోళనలు అధికం కావడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురి ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్ల కారణంగా మృతుల సంఖ్య 11 చేరుకున్నట్లు తెలుస్తోంది.
Next Story