పోలీసుల శవాలను తగులబెట్టాలనుకున్నా.. విచారణలో వికాస్‌ దూబే సంచలన విషయాలు వెల్లడి

By సుభాష్  Published on  10 July 2020 3:49 AM GMT
పోలీసుల శవాలను తగులబెట్టాలనుకున్నా.. విచారణలో వికాస్‌ దూబే సంచలన విషయాలు వెల్లడి

8 మంది పోలీసులను మట్టుబెట్టి వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎట్టకేలకు పోలీసులు హతమార్చారు. అయితే గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి వెళ్లగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతన్ని యూపీ తరలిస్తుండగా, కాన్పూర్‌ సమీపంలో వారి వాహనం బోల్తా పడింది. దీంతో పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోని కాల్పులు జరుపుతూ పారారవుతుండగా, పోలీసులు అతమార్చారు. ఈ కాల్పుల్లో వికాస్‌ దూబే హతమయ్యాడు. అలాగే పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

అయితే విశ్వసనీయ సమాచారం మేరకు... దూబేను నిన్న అరెస్ట్‌ చేసిన తర్వాత పోలీసులు అతన్ని విచారించారు. పోలీసుల విచారణలో దూబే పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. 8 మంది పోలీసులను హతమార్చిన రోజు .. పోలీసులు వస్తారనే సమాచారం ముందుగానే అందినట్లు తెలిపాడు. పోలీసులను చంపిన తర్వాత మృతదేహాలను తగలబెట్టాలని భావించానని, మృతదేహాలను దహనం చేయడానికి ఒకే చోట సేకరించి చమురు కూడా ఏర్పాటు చేశానని విచారణతో తెలిపినట్లు తెలుస్తోంది.

అలాగే వికాస్‌ దూబే పోలీసులతో సన్నిహితంగా ఉన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడట. ఉదయం పోలీసులు వస్తారని ముందుగానే మాకు సమాచారం అందింది. పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారనే భయంతో దాడులకు దిగి పోలీసులను హతమార్చాను అని చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, వికాస్‌దూబే 2001లో రాష్ట్ర మంత్రి సంతోష్‌ శుక్లా హత్య కేసులు ప్రధాని నిందితుడు. 2004లో కేబుల్‌ వ్యాపారవేత్త దినేష్‌దూబే హత్య కేసులు కూడా ప్రధాన నిందితుడు. అలాగే దూబే నుంచి పోలీసులు పలు కీలక విషయాలను కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. తనకు చాలా మంది పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది.



Next Story