రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి
By తోట వంశీ కుమార్ Published on 22 July 2020 4:58 PM ISTవికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ముగ్గురు మృతి సిబ్బంది మృతి చెందారు. రైలు ఇంజిన్ ఢీకొని ముగ్గురు మృతి చెందగా.. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసీనది పై ఉన్న బ్రిడ్జిపై సుమారు 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింట్ వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెలుతుంది.
ట్రాక్‌పై పనులు చేస్తున్న సిబ్బందికి ఎలాంటి సమాచారం లేదు. రైలు సమీపంలోకి వచ్చిన తరువాతనే రైల్వే ఉద్యోగులు గమనించారు. ట్రాక్‌పై నుంచి తప్పుకునే క్రమంలో ముగ్గురిని రైలింజన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా తొమ్మిది మంది తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు, వికారాబాద్ ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.