మా అమ్మ అంత్యక్రియలకు వెళ్తే ఆవిడ ఆత్మ శాంతించదు : ఎస్సై

By అంజి  Published on  1 April 2020 1:45 PM GMT
మా అమ్మ అంత్యక్రియలకు వెళ్తే ఆవిడ ఆత్మ శాంతించదు : ఎస్సై

కరోనా బూచి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు పోలీసులు తమ కుటుంబాలను వదిలిపెట్టి రేయింబవళ్లు రోడ్లపై కాపలా కాస్తున్నారు. అనవసరంగా ఎవరైనా రోడ్లపై తిరిగితే వారికి వైరస్ పై అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు వారి కుటుంబానికి ఎంతకష్టమొచ్చినా సరే..విధులను మాత్రం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే విజయవాడ రైల్వే లో ఎస్సైగా పనిచేస్తున్న శాంతారాం.

మూడు రోజుల క్రితం ఎస్సై శాంతారాం తల్లి స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసిన పై అధికారి సెలవు ఇచ్చినప్పటికీ అతను తల్లి అంత్యక్రియలకు హాజరవ్వలేదు. ఎందుకు హాజరవ్వలేదో అతని మాటల్లోనే తెలుసుకుందాం.

'' నా పేరు శాంతారాం. నేను విజయవాడలోనే ఎస్సైగా పనిచేస్తున్నాను. మా అమ్మగారు విజయనగరంలో మూడ్రోజుల క్రితం చనిపోయారు. అంత్యక్రియల కోసం నేను అక్కడికి వెళ్లాలంటే 4 జిల్లాలు..40 చెక్ పోస్టులలో ఎంతమందిని కలుస్తూ దాటాలి. ఇలా వెళ్లడం వల్ల తనకు కరోనా వైరస్ సోకితే..ఆ వైరస్ ను మా అమ్మగారిని చూసేందుకు వచ్చినవారందరికీ వ్యాపించేందుకు కారణమవుతాను. అందుకే మా తమ్ముడినే అంత్యక్రియలు ముగించమని చెప్పాను. అలా జరిగిన అంత్యక్రియలను వీడియోలో చూసి..నేనే చేసినట్లు భావించాను. ఒకవేళ నేనే గనుక వెళ్లి ఉంటే.. వెళ్లి రావడానికి మూడ్రోజులు, వచ్చాక 15 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఈ కారణంగా విధులు నిర్వర్తించలేను. విధులు నిర్వర్తించకపోతే మా అమ్మగారి ఆత్మ శాంతించదు. ఆవిడ ఆత్మ శాంతించాలంటే విధులు నిర్వహించాలని తలంచి..ఇక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్నారు.

ఇంత అంకిత భావంతో పనిచేస్తున్న మా కష్టాన్ని గుర్తించి మీరంతా మరో రెండు వారాలపాటు ఇళ్లలోనే ఉంటే..కరోనాను పూర్తిగా జయించగలం'' అని పేర్కొన్నారు.

అన్ని కష్టాలను తట్టుకుని ప్రజలకోసం అకుంటిత సేవాభావంతో పనిచేస్తున్న పోలీసులను చూశాక కూడా మీకు రోడ్లపై తిరగాలనిపిస్తుందా ? దయచేసి ఇంట్లో ఉండండి. దేశాన్ని కాపాడండి.

https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-01-at-7.00.36-PM.mp4

Next Story