విజ‌య‌వాడ‌లో కాల్పుల కలకలం.. వ్య‌క్తి మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 11 Oct 2020 9:22 AM IST

విజ‌య‌వాడ‌లో కాల్పుల కలకలం.. వ్య‌క్తి మృతి

విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి గుర్తుతెలి‌య‌ని వ్య‌క్తులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి మ‌హేష్‌గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్‌రోడ్డులోని ఓ బార్‌ సమీపంలో చోటుచేసుకుంది.

నిందితులు పథకం ప్రకారమే మహేష్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన స్థలాన్ని సీపీ బత్తిన శ్రీనివాసులు అర్ధరాత్రి పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story