రెచ్చిపోయిన మావోలు.. టీఆర్ఎస్ నేత దారుణహత్య

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 3:17 AM GMT
రెచ్చిపోయిన మావోలు.. టీఆర్ఎస్ నేత దారుణహత్య

తెలంగాణ‌లో మావోయిస్టులు మ‌రోమారు రెచ్చిపోయారు. ములుగు జిల్లా కేంద్రం వెంక‌టాపురంలో టీఆర్ఎస్ నేత మాడూరి భీమేశ్వరరావును మావోయిస్టులు దారుణంగా చంపేశారు. వెంకటాపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లారు. స్థానికంగా పురుగుల మందుల వ్యాపారం నిర్వహిస్తున్న భీమేశ్వరరావుకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇదిలావుంటే.. ఐదు రోజుల క్రితమే వెంకటాపురంలో డీజీపీ, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పర్యటించారు. మావోల సంచారంపై పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. డీజీపీ పర్యటించిన ప్రాంతంలో మావోలు ఈ చర్యకు పాల్పడటాన్ని గమనిస్తే.. పోలీసులకు సవాల్ విసిరినట్లుగానే కనిపిస్తోంది.

Next Story